బాలయ్య-చిరంజీవి చేతులు కలిపేసారా!
అదే నిజమైతే 'జైలర్ 2' సంచలనమే. అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడతాయి. కోలీవుడ్ కి ఇంత కాలం సాధ్యం కాని 1000 కోట్ల క్లబ్ కూడా జైలర్ 2 తో సాధ్యమవుతుంది.;
మెగాస్టార్ చిరంజీవి-నటసింహ బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందా? అని మెగా-నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. సాక్షాత్తు చిరంజీవే బాలయ్యతో కలిసి నటించాలని ఉందనే కోర్కెను వ్యక్తం చేయడంతో? ఒక్కసారిగా ఆ కాంబో అంటే ఆసక్తి పెరిగి పోయింది. ఈ ఛాన్స్ బోయపాటి శ్రీను ఎప్పుడు తీసుకుంటాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి బోయపాటి తీసుకుంటాడా? లేదా? అన్నది తెలియదు గానీ తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తీసుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'జైలర్ 2'కి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోలు నటిస్తారని ముందుగానే తేలిపోయింది. 'జైలర్' లో కొనసాగిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు మరింత మంది స్టార్స్ యాడ్ అవుతారని ప్రచారం జరగుతోంది.
అందుకు తగ్గట్టే టాలీవుడ్ నుంచి బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగు తోంది. దాదాపు ఆయన ఎంట్రీ కన్పమ్ అయిందని వార్తలొస్తున్నాయి. అయితే ఇదే సినిమాలో చిరంజీవి కూడా నటిస్తారనే ప్రచారం మొదలైంది. ఇటీవలే రజనీకాంత్ ఫోన్ చేసి చిరంజీవి కూడా నటించాలని అభ్యర్దిం చారుట. నెల్సన్ దిలీప్ కోరిక మేరకు ఓ పవర్ ఫుల్ పాత్ర ఆఫర్ చేయడంతో రజనీ మాట కాదనలేక చిరు కూడా ఒకే చెప్పారని కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది.
అదే నిజమైతే 'జైలర్ 2' సంచలనమే. అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడతాయి. కోలీవుడ్ కి ఇంత కాలం సాధ్యం కాని 1000 కోట్ల క్లబ్ కూడా జైలర్ 2 తో సాధ్యమవుతుంది. మెగా-నందమూరి ఆశ..కోరిక కూడా నెరవేరుతుంది. ఇలాంటి సినిమాలో బాలయ్య-చిరు పాత్రలు మరింత పవర్ ఫుల్ గా..స్టైలిష్ గానూ ఉంటాయి.