పెళ్లి విషయమై నిర్ణయం మార్చుకుందట!

Update: 2022-01-24 00:30 GMT
హీరోయిన్స్ ఎక్కువ శాతం మంది కెరీర్‌ లో బిజీగా ఉన్న సమయంలో పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు. ఒక వేళ ప్రేమలో ఉన్నా కూడా సినిమాల్లో ఆఫర్లు తగ్గిన తర్వాత మాత్రమే పెళ్లికి సిద్ధం అవుతారు. పెళ్లి తర్వాత ఆఫర్లు రావనే ఉద్దేశ్యంతో చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటారు. ఈమద్య కాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు మూడు పదుల వయసు దాటినా కూడా పెళ్లి ఆలోచన చేయడం లేదు. కొందరు అయితే ఏకంగా నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు. తాజాగా తమన్నా ను పెళ్లి గురించి ప్రశ్నిస్తే మరి కొంత కాలం ఆగాలి అన్నట్లుగా ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తమన్నా కెరీర్‌ ముగిసినట్లే అని కొన్నాళ్ల క్రితం అనిపించింది. ఆమెకు సినిమా ఆఫర్లు లేవు.. ఫిల్మ్‌ మేకర్స్ ఆమెను పక్కన పెట్టేసినట్లుగా వ్యవహరించారు. కాని అనూహ్యంగా తమన్నా కెరీర్‌ మళ్లీ పుంజుకుంది. ఆఫర్లు తగ్గిన సమయంలో ఆమె పెళ్లికి ఓకే చెప్పింది అనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూశారు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు పెళ్లి సంబంధాల విషయంలో ఆమె కొన్నాళ్లు వెయిట్‌ చేయాలంటూ కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లికి మరో రెండు మూడు సంవత్సరాల సమయం కావాలి అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు మరియు వెబ్‌ సిరీస్ అవకాశాలు వస్తున్నాయి. కనుక ఈ సమయంలో సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకోవడం అవివేకం అవుతుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పెళ్లి విషయంలో నిర్ణయాన్ని మార్చుకుందనే టాక్ వినిపిస్తుంది. తమన్నా కెరీర్‌ లో ఎన్నో ఒడి దొడుకులు ఎదుర్కొంది. ఇప్పుడు మళ్లీ ఆమె కెరీర్‌ మంచి పీక్స్‌ లో ఉంది. ఒక వైపు ఐటెం సాంగ్స్.. మరో వైపు హీరోయిన్‌ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో రకాలుగా తమన్నా బిజీ బిజీగా ఉంది. కనుక పెళ్లి విషయం లో ఆమె మరో రెండు మూడు ఏళ్లు వెయిట్‌ చేయడం మంచి ఉద్దేశ్యం అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరికొన్ని సంవత్సరాలు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News