‘ఆర్టికల్‌ 15’ సౌత్‌ రీమేక్స్‌ కన్ఫర్మ్‌

Update: 2020-08-04 04:45 GMT
బాలీవుడ్‌ లో ఆయుష్మాన్‌ ఖరాన హీరోగా అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో రూపొందిన ఆర్టికల్‌ 15 చిత్రంకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అయిన నెట్‌ ఫ్లిక్స్‌ లో కూడా మంచి వ్యూస్‌ ను సొంతం చేసుకుంటుంది. దాదాపుగా ఏడాది క్రితం వచ్చిన ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. తమిళం మరియు తెలుగులో ఈ చిత్రంను రీమేక్‌ చేసేందుకు ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ రెడీ అవుతున్నాడు.

తమిళ ఆర్టికల్‌ 15 చిత్రంలో స్టార్‌ హీరో ధనుష్‌ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాపై చాలా ఆసక్తిగా ధనుష్‌ ఉన్నాడట. ఇప్పటికే సైన్‌ కూడా చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగు విషయంలో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. తెలుగు రీమేక్‌ కోసం అడవి శేషును సంప్రదించారట. ఆయన కాదంటే సత్యతో అయినా ఈ సినిమా రీమేక్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి చిత్రీకరణ చేయడం వల్ల బడ్జెట్‌ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే దర్శకులు మరియు ఇతర సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి ఈ రీమేక్‌ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News