రాను రానంటూనే చిన్నదో..

Update: 2015-09-24 17:30 GMT
ఓ 21 ఏళ్లక్రితం మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్. తర్వాత ఎన్నో కష్టాలు - మరెన్నో ఆటుపోట్లు ఎదుర్కుని సినీ ఇండస్ట్రీలో టాప్ స్టేజ్ కి చేరుకుంది. అభిషేక్ బచ్చన్ ని పెళ్లిచేసుకుని.. అమితాబ్ కోడలిగా కొత్త రోల్ లోకి వెళ్లాక.. కొత్త ప్రాజెక్టులు సైన్ చేయలేదు. మళ్లీ ఇన్నేళ్లకి జాజ్ బా తో రీఎంట్రీ ఇస్తోంది ఐష్.

ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే.. ఇన్ని మెట్లు ఎక్కిన ఐశ్వర్యారాయ్ - ఎప్పుడూ సోషల్ మీడియా వంక కన్నెత్తి చూడలేదు. ట్విట్టర్ - ఫేస్ బుక్ లాంటి సైట్ లపై ఇష్టం లేదని కూడా చెప్పేసింది ఓ టైంలో. కానీ ఇప్పుడీ నీలి కళ్ల సుందరి మనసు మార్చుకుంది. త్వరలో ఖాతా ఓపెన్ చేస్తోందట ట్విట్టర్ లో. ఆ విషయాన్ని స్వయంగా జాజ్ బా డైరెక్టర్ సంజయ్ గుప్తా చెప్పాడు.

జాజ్ బా రిలీజ్ కి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలోకి ఐష్ ఎంట్రీ ఉంటుందట. మొత్తానికి సామాజిక సైట్ల పవర్ ఏంటో ఇప్పటికి అర్ధమైనట్లుంది ఐష్ కి. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ముదురు సుందరి బాగా కమర్షియల్. ప్రమోషన్స్ విషయంలో పక్కాగా ప్లానింగ్ తో ఉంటుంది. ఇప్పుడు పబ్లిసిటీ, ప్రమోషన్ లకు సోషల్ మీడియా కంపల్సరీ అయిపోయింది. సెలబ్రిటీలకు వీటిలో అకౌంట్ లేకపోతే అదో లోటుగా లెక్కేయాల్సి వస్తోంది. అందుకే లేటుగా అయినా రాక తప్పలేదు అందాల ఐశ్వర్యారాయ్ కి.
Tags:    

Similar News