బాలయ్యతో ఈసారి బ్లాస్టింగ్ ప్లాన్..!

స్టార్ హీరో అభిమానికి ఆ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో కొన్ని సినిమాలు ఐడియాలోకి వస్తాయి.

Update: 2025-02-24 02:45 GMT

స్టార్ హీరో అభిమానికి ఆ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో కొన్ని సినిమాలు ఐడియాలోకి వస్తాయి. అలాంటి సినిమాల్లోనే ఒకటి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి. బాలకృష్ణ మీద తనకున్న అభిమానాన్ని తన మార్క్ మాస్ సినిమాతో మేళవించి సిస్టర్ సెంటిమెంట్ తో ఆ సినిమా చేశాడు గోపీచంద్. ఇక బాయ్య మాస్ సినిమా తీస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఈమధ్య వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అదరగొట్టేసింది.

ఐతే వీర సింహా రెడ్డి కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈమధ్యే బాలయ్య ఈ కాంబో సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఇయర్ దసరాకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు. ఐతే ఆ నెక్స్ట్ సినిమా గోపీచంద్ తోనే ఉంటుందని తెలుస్తుంది. గోపీచంద్ కూడా తను చేస్తున్న బాలీవుడ్ సినిమా పూర్తి కాగానే బాలయ్య కథ మీద కూర్చోనున్నాడు.

ఐతే ఈసారి గోపీచంద్ మలినేని బాలయ్యతో చేసే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. ఆల్రెడీ గోపీచంద్ మలినేని ఒక లైన్ రాసుకున్నాడని దానికి ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సి ఉందని అంటున్నారు. ఐతే బాలకృష్ణ తో ఈసారి రెగ్యులర్ మాస్ సినిమాలా కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఊర మాస్ అంటే ఇదేరా అనిపించే సినిమా చేయాలని గోపీచంద్ మలినేని ప్లానింగ్ లో ఉన్నాడట.

అఖండ 2 ఎలాగు నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అదే దారిలో గోపీచంద్ మలినేని సినిమా కూడా వస్తే స్టార్ హీరోలకు ధీటుగా బాలయ్య పాన్ ఇండియా సినిమాల హవా ఉంటుందని చెప్పొచ్చు. బాలకృష్ణ గోపీచంద్ కాంబో కోసం నందమూరి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ మలినేని ప్లానింగ్ ఏమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు. సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ వచ్చి ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందించిన బాలయ్య బాబు ఆ సినిమా డైరెక్టర్ బాబీతో కూడా మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News