ఫొటోటాక్‌ : చీరలో రౌడీ సువర్ణ మెరిసి పోతోంది

Update: 2020-10-07 04:00 GMT
తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అయినా కూడా తమిళనాట హీరోయిన్‌ గా ఐశ్వర్య రాజేష్‌ పరిచయం అయ్యింది. అక్కడ నటిగా మంచి గుర్తింపు దక్కించుకుని తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో డీ గ్లామర్‌ గా కనిపించిన ఐశ్వర్య ఆ తర్వాత సినిమాల్లో కూడా అదే తరహాలో కనిపించింది. ముఖ్యంగా రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌ సువర్ణ పాత్రలో నటించి మెప్పించింది. ఆ పాత్రకు ఐశ్వర్య ప్రాణం పోసింది అనడంలో సందేహం లేదు. సినిమా ఫ్లాప్‌ అయినా కూడా ప్రేక్షకులు ఆమెను అలా గుర్తు పెట్టుకున్నారు.

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ లో చాలా సింపుల్‌ లుక్‌ లో కనిపించిన ఐశ్వర్య సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ఫొటోల్లో మాత్రం చాలా ట్రెండీగా కనిపిస్తుంది. తాజాగా ఈమె ప్రముఖ మ్యాగజైన్‌ జే ఎఫ్‌ డబ్ల్యూ కవర్‌ పై కనిపించింది. అందులో చీర కట్టులో కనిపించింది. మోడ్రన్‌ డ్రస్‌ లతో పాటు చీర కట్టులోనూ చాలా అందంగా కనిపించే ఈ అమ్మడు ఈ కవర్‌ ఫొటోతో వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో చీర కట్టులో సూపర్బ్‌ గా ఉన్నారంటూ కామెంట్స్‌ పొందింది. చీర కట్టులోనూ ఎక్స్‌ పోజింగ్‌ చేయవచ్చు. కాని అలాంటిది ఏమీ లేకుండానే ఈ కవర్‌ పై ఆమె నిలిచింది. అయినా కూడా నెటిజన్స్‌ ఆమెకు ఫిదా అవుతూనే ఉన్నారు.
Tags:    

Similar News