మహిళా ఫ్యాన్ కు సీనియర్ సింగర్ లిప్ కిస్.. నెటిజన్ల విమర్శల వర్షం!

ఓ కన్సర్ట్ లో మహిళా అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి వెళ్తే.. ఉదిత్ నారాయన్ ఏకంగా ఆమెకు లిప్‌ కిస్‌ ఇవ్వడంపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

Update: 2025-02-01 09:23 GMT

సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణ్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ కన్సర్ట్ లో మహిళా అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి వెళ్తే.. ఉదిత్ నారాయన్ ఏకంగా ఆమెకు లిప్‌ కిస్‌ ఇవ్వడంపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. దిగ్గజ సింగర్ అయ్యి ఉండి ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏమైందంటే?

ముంబయిలో రీసెంట్ గా ఉదిత్ నారాయ‌ణ్ మ్యూజిక్ క‌న్సర్ట్ ను నిర్వహించారు. ఆ సమయంలో ఆయన 'టిప్ టిప్ బర్సా పానీ' అనే పాట‌ను పాడారు. అప్పుడు ఉదిత్ తో సెల్ఫీలు తీసుకోవడానికి మ‌హిళా అభిమానులు వేదికకు వెళ్లారు. ఆయన అప్పుడు.. ఒకవైపు పాట పాడుతూనే.. మరోవైపు తన ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగారు.

అదే సమయంలో మహిళా అభిమానుల బుగ్గలపై ముద్దు పెట్టారు. దీంతో వారు కూడా షాక్ అయ్యారు. అంతటితో ఆగకుండా ఓ ఫ్యాన్ పెదవులపై కూడా ఆయ‌న‌ ముద్దు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. అలా ఆయన వార్తల్లో నిలిచారు.

మ‌హిళా అభిమానుల‌తో ఉదిత్ నారాయణ్ ప్ర‌వ‌ర్తించిన‌ తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆయ‌న‌కు ఇప్పుడేం కొత్త కాదని, గ‌తంలోనూ ఇలాగే ప్ర‌వ‌ర్తించార‌ని కామెంట్లు పెడుతున్నారు. సింగ‌ర్స్ అల్కా యాగ్నిక్‌, శ్రేయా ఘోష‌ల్‌ కు ఇలానే చెంప మీద‌ అప్పట్లో ముద్దు పెట్టి షాకిచ్చారు ఉదిత్. ఆ పిక్స్ కూడా నెటిజన్లు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు.

అయితే సింగర్ గా ఉదిత్ నారాయణ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. బాలీవుడ్ సినిమాల్లోని ఎన్నో పాటలు పాడి.. మ్యూజిక్ లవర్స్ ను ఓ రేంజ్ లో మెప్పించారు. వీర్ జారా, జో జీతా వ‌హి సికంద‌ర్, స్వ‌దేశ్, దిల్ సే, దిల్ తో పాగ‌ల్ త‌దిత‌ర మ్యూజికల్ హిట్స్ ను ఆయన అందించారు. తెలుగులో కూడా పలు పాటలు పాడారు.

అమ్మాయే సన్నగా, అందమైన ప్రేమరాణి, అందాల ఆడబొమ్మ, కీరవాణి రాగంలో, పసిఫిక్‌ లో దూకేమంటే వంటి అనేక సూపర్ హిట్ సాంగ్స్ ను పాడి టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు కన్సర్ట్ లో మహిళా అభిమానులకు ముద్దులు పెట్టి వివాదంలో చిక్కుకుని విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి దీనిపై ఆయన స్పందిస్తారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News