పవర్ఫుల్ యాడ్ తో వచ్చిన బన్నీ.. ఆ లుక్కు కేక!
ఇక ఈసారి యాడ్ లో బన్నీ హైలెట్ అయ్యాడు. ఇందులో బన్నీ డిఫరెంట్ లుక్ లో మెస్మరైజ్ చేశాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాతో వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాడు. చాలా ఏరియాల్లో ‘బాహుబలి 2’ కలెక్షన్స్ రికార్డ్ ని సైతం ఈ మూవీ బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న హీరోల జాబితాలో అమీర్ ఖాన్ తర్వాత రెండో స్థానంలో బన్నీ ఉన్నారు. పుష్ప 2తో 1800 కోట్ల మార్క్ దాటడంతో బన్నీ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా బన్నీకి విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది.
దీంతో వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులని ఇండియన్ వైడ్ గా ప్రమోట్ చేసుకోవడానికి ఐకాన్ స్టార్ ఇమేజ్ ని ఉపయోగించుకుంటున్నారు. అతనితో బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒప్పందం చేసుకుంటున్నారు. ఒకప్పుడు హిందీలో ఒక స్టార్ అలాగే సౌత్ లో వేరొక స్టార్ ని ఉపయోగించుకొని తమ ఉత్పత్తులని ప్రమోట్ చేసుకునేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని భాషలకి బన్నీ బ్రాండ్ వేల్యూని యూజ్ చేసుకుంటున్నారు.
‘పుష్ప 2’ తర్వాత ఐకాన్ స్టార్ తాజాగా థమ్స్ అప్ యాడ్ లో నటించాడు. చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ స్టార్స్ కూడా గతంలో థమ్స్ అప్ యాడ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈసారి యాడ్ లో బన్నీ హైలెట్ అయ్యాడు. ఇందులో బన్నీ డిఫరెంట్ లుక్ లో మెస్మరైజ్ చేశాడు. స్టైలిష్ మేకోవర్ కి కాస్తా గడ్డం, లాంగ్ హెయిర్ తో కనిపించాడు. ఈ లుక్ లో బన్నీ చాలా మాసివ్ గా ఉన్నాడనే మాట వినిపిస్తోంది. ఈ యాడ్ కూడా చాలా క్రియేటివ్ గా ఉంది. యాడ్ లో బన్నీ స్టైల్, లుక్స్ కి అతని ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
సిచ్యువేషన్ ఎలాంటిది అయినా ఒక్క సిప్ చేయ్.. అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ కూడా అదిరింది. అడవిలో స్లయిడింగ్ చేస్తూ యాక్షన్ స్టఫ్ ఇచ్చాడు. ఇక ఇదే లుక్ తో ఒక మాస్ మూవీ పడితే మరోసారి బన్నీ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయడం గ్యారెంటీ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ తర్వాత సరికొత్త లుక్స్ తో కనిపించడంతో థమ్స్ అప్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక బన్నీ నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ చేయబోతున్నాడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే అది ఎప్పుడు మొదలు పెడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఇంటికే పరిమితం అయిన బన్నీ మరల ఆ మూడ్ నుంచి బయటకొచ్చి షూటింగ్స్ కి సిద్ధమయ్యాడని ఈ యాడ్ చూస్తుంటే తెలుస్తుంది. ఎప్పటిలాగే బన్నీ తన ఎనర్జీని మరోసారి ఈ యాడ్ లో చూపించి థ్రిల్ చేసాడు.