1000 కోట్ల దాహం తీరేలా ఎన్టీఆర్ లైనప్!

పాన్ ఇండియా మార్కెట్‌లో ఎన్టీఆర్ క్రేజ్‌కు కొత్త పుంతలు తొక్కాల్సిన సమయం ఆసన్నమైంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అంత భారీ స్థాయిలో వసూళ్లు అందుకున్న సినిమా ఇంకా రాలేదు.

Update: 2025-02-01 11:30 GMT

పాన్ ఇండియా మార్కెట్‌లో ఎన్టీఆర్ క్రేజ్‌కు కొత్త పుంతలు తొక్కాల్సిన సమయం ఆసన్నమైంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అంత భారీ స్థాయిలో వసూళ్లు అందుకున్న సినిమా ఇంకా రాలేదు. ‘దేవర’ సినిమాతో బిగ్ స్కేల్‌లో వచ్చినప్పటికీ, అది 500 కోట్ల మార్క్‌ను టచ్ చేయలేకపోయింది. వసూళ్లు బాగానే ఉన్నా, ఎన్టీఆర్ మైండ్‌లో ఉన్న లెక్కలు పూర్తిగా చేరినట్లు అనిపించలేదు. అందుకే ఇప్పుడతని ఫోకస్ టోటల్‌గా భారీ కమర్షియల్ కంటెంట్‌పై పడింది. వచ్చే సినిమాలన్నీ 1000 కోట్ల టార్గెట్‌తోనే ప్లాన్ అవుతున్నాయి.

ఈ క్రమంలో బాలీవుడ్‌లో కూడా తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా చేశాడు. హృతిక్ రోషన్, ఆదిత్య చోప్రా ప్రొడక్షన్ హౌస్ లాంటి బాలీవుడ్ మాస్ కమర్షియల్ ఫ్రాంచైజీలో కీలక పాత్ర పోషించడం వల్ల, ఉత్తరాదిలో ఉన్న విపరీతమైన ఫాలోయింగ్‌ను తనదిగా చేసుకోవడానికి ఇది రికార్డ్ హిట్ అవుతుందని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. హాలీవుడ్ స్థాయి యాక్షన్, గ్రాండ్ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా అతని మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం.

ఈ సినిమా అనంతరం వచ్చే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వబోతోంది. ‘సలార్’ మాదిరిగా యాక్షన్, మాస్ మసాలాతో నిండిపోయిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇది 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. నీల్ మేకింగ్, ఎన్టీఆర్ క్రేజ్ కలిస్తే రికార్డులు పడిపోవడం ఖాయం.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్‌ను కూడా చాలా స్ట్రాంగ్‌గా లైన్‌లో పెట్టినట్లు సమాచారం. కోలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌తో తారక్ ఓ భారీ మాస్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘జైలర్’తో 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రజినీకాంత్‌ను బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన నెల్సన్, ఇప్పుడు ‘జైలర్ 2’ కూడా భారీ టార్గెట్‌తో ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో పనిచేయబోతున్నట్లు సమాచారం.

నెల్సన్ తన మార్క్ మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలతో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న దర్శకుడు. ఎన్టీఆర్‌తో కలిసి చేస్తే.. ఇది మినిమమ్ 1000 కోట్ల టార్గెట్ మూవీగా నిలుస్తుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తారక్ ఎంచుకుంటున్న లైనప్ చూస్తుంటే, రాబోయే ఏళ్లలో అతని సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. పుష్ప 2 ఇచ్చిన నమ్మకంతోనే దేవర 2 స్క్రిప్ట్ పనులు కూడా సాగుతున్నాయి. భవిష్యత్తులో ఆ సినిమా కూడా గ్రాండ్ గానే ఉండవచ్చు అనే టాక్ వస్తోంది.

Tags:    

Similar News