'పుష్ప'ను ఫ్రీగా చూసేయండి..!
ఇదే సమయంలో పుష్ప మొదటి పార్ట్‌ను చూడని వారు సైతం ఓటీటీలో చూసేందుకు అమెజాన్ వైపు పరుగులు తీశారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దానికి సీక్వెల్‌ను అంతకు మించి రూపొందించి భారీ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకుంది. పుష్ప 2 సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా అన్ని చోట్ల రికార్డ్‌లను బ్రేక్ చేసింది. ఎప్పటి నుంచో ఉన్న బాహుబలి 2 రికార్డ్‌లను సైతం బ్రేక్ చేసింది. దాదాపు రూ.2000 కోట్ల వసూళ్లు రాబట్టిన పుష్ప 2 సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ అయ్యింది. ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు నెట్‌ఫ్లిక్స్‌కి క్యూ కట్టారు. ఇదే సమయంలో పుష్ప మొదటి పార్ట్‌ను చూడని వారు సైతం ఓటీటీలో చూసేందుకు అమెజాన్ వైపు పరుగులు తీశారు.
అప్పుడు పుష్ప 1 ను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేసింది. పుష్ప సాధించిన విజయం కారణంగా అమెజాన్ భారీ మొత్తంలో లాభం దక్కించుకుని ఉంటుంది. నిన్న మొన్నటి వరకు అమెజాన్‌లో పుష్ప సినిమా చూడాలి అంటే సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. కానీ ఇప్పుడు పుష్ప సినిమాను ఉచితంగా చూడవచ్చు. దాదాపు పాతిక కోట్ల ఖాతాదారులను కలిగి ఉన్న ఎంఎక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని ఇటీవల అమెజాన్ కొనుగోలు చేసింది. దాంట్లో అమెజాన్ ప్రైమ్ కంటెంట్‌ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పుష్ప సినిమాను ఎంఎక్స్‌లో స్ట్రీమింగ్ మొదలు పెట్టినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఇన్నాళ్లు సబ్‌స్క్రిప్షన్‌తో మాత్రమే చూసిన ప్రేక్షకులు పుష్ప సినిమాను ఉచితంగా చూడవచ్చు. కానీ మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్స్ లేకుండా సినిమాని చూడాలి అంటే మాత్రం మళ్లీ అమెజాన్ సబ్‌స్క్రీప్షన్‌ను తీసుకోవాల్సిందే. పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఉచితంగా అందుబాటులో ఉంటే కచ్చితంగా లక్షల మంది యూజర్స్ చూసేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. తద్వారా అమెజాన్ ఎంఎక్స్ లో వచ్చే యాడ్స్‌తోనూ పుష్ప సినిమాతో లాభం దక్కించుకునే అవకాశం ఉంటుందని డిజిటల్ మార్కెటింగ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా నిలిచిన అల్లు అర్జున్ ముందు ముందు ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. పుష్ప 2 సినిమా రెండు వేల కోట్ల వసూళ్ల నేపథ్యంలో అల్లు అర్జున్‌కి జాతీయ స్థాయిలో స్టార్ డం దక్కింది. అందుకే ఆయన తదుపరి సినిమా సైతం పాన్ ఇండియా మూవీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తదుపరి సినిమా ఉండబోతుంది. ఈ సినిమాతో మొదటి సారి త్రివిక్రమ్ పాన్ ఇండియా మార్కెట్‌లో అడుగు పెట్టబోతున్నారు. ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌తో త్రివిక్రమ్, బన్నీ కాంబో రూపొందబోతుందని, ఈ ఏడాదిలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.