పిక్‌టాక్ : చీర కట్టులో అందాల రాశి

సోషల్‌ మీడియాలో రాశి ఖన్నా గురించి రెగ్యులర్‌గా ప్రచారం జరిగేలా ఆమె అందం ఉంటుంది అనడంలో సందేహం లేదు.;

Update: 2025-03-05 16:30 GMT

 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అయిన రాశి ఖన్నా తక్కువ సమయంలోనే పలువురు యంగ్‌ హీరోలకు జోడీగా నటించింది. కెరీర్‌ ఆరంభంలో కాస్త బరువు ఎక్కువగా అనిపించిన రాశి ఖన్నా తెలుగు ప్రేక్షకుల కోసం, టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం కోసం రాశి ఖన్నా బరువు తగ్గింది. బరువు తగ్గిన తర్వాత రాశి ఖన్నా పేరుకు తగ్గట్టు మరింత అందంగా ఉందని అభిమానులు కామెంట్స్ చేశారు. సోషల్‌ మీడియాలో రాశి ఖన్నా గురించి రెగ్యులర్‌గా ప్రచారం జరిగేలా ఆమె అందం ఉంటుంది అనడంలో సందేహం లేదు.

ఈమధ్య కాలంలో తెలుగులో కాస్త ఆఫర్లు తగ్గడంతో తమిళ్‌లో ఈ అమ్మడు బిజీ అయ్యే ప్రయత్నాలు చేసింది. లక్కీగా ఈమధ్య తమిళ్‌, హిందీలో వరుసగా ఆఫర్లు దక్కుతున్నాయి. తెలుగులో ఈమె చివరగా థాంక్యూ లో నాగ చైతన్యతో కలిసి కనిపించింది. ఆ తర్వాత రాశి ఖన్నా తెలుగు వెండి తెరపై కనిపించలేదు. కానీ హిందీ, తమిళ్‌లో మాత్రం చాలానే సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాతో రాశి ఖన్నా మళ్లీ టాలీవుడ్‌లో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను ఈ అమ్మడు షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.


తాజాగా మరోసారి రాశి ఖన్నా తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి చీర కట్టు అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రీన్ కలర్‌ చీరలో స్లీవ్‌లెస్‌ బ్లౌజ్ ధరించి నడుము అందం చూపిస్తూ కన్నుల విందు చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు దాటినా, వయసు మూడు పదులకు చేరిన రాశి ఖన్నా మాత్రం ఇంకా 20 ఏళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా చాలా అందంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో రాశి ఖన్నా అందమైన చీర కట్టు ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతటి అందంకు టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కక పోవడం విడ్డూరంగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.


రాశి ఖన్నా ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే హిందీలో ఒక సినిమాకు కమిట్‌ అయింది. తెలుగులో తెలుసు కదా సినిమాను చేస్తుంది. సిద్దు హీరోగా నటిస్తున్న తెలుసు కదా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ కనిపించనుండగా, అందులో ఒక హీరోయిన్‌గా రాశి ఖన్నా కనిపించబోతుంది. నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల స్లోగా సాగుతుంది. ఈ ఏడాదిలో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సిద్దు తో కలిసి నటిస్తున్న ఈ సినిమా తెలుగులో రాశి ఖన్నాను తిరిగి బిజీ చేస్తుందా అనేది చూడాలి.

Tags:    

Similar News