బిటెక్ చదవమంటున్నారని టెన్త్, ఇంటర్ తగలబెట్టిన డైరెక్టర్!
అయితే ఓ ఈవెంట్ లో శ్రీకాంత్ ఓ ఆసక్తిర విషయంతో స్టన్ అయ్యేలా చేసాడు.;
'దసరా' తో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల సుపరిచితమే. తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లోచేరిన డైరెక్టర్. ప్రస్తుతం నాని హీరోగా 'ది ప్యారడైజ్' సినిమా చేస్తున్నాడు. ఇదీ పక్కా మాస్ యాక్షన్ ఎటర్ టైనర్ అని టీజర్ తో తేలిపోయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ప్యారడైజ్ తర్వాత చిరంజీవి సినిమా మొదలవుతుంది. అయితే ఓ ఈవెంట్ లో శ్రీకాంత్ ఓ ఆసక్తిర విషయంతో స్టన్ అయ్యేలా చేసాడు.
ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడుట. అందుకు ఓ కారణంగా ఉంది. సినిమాల మీద ఆసక్తితోనే ఆ పని చేసాడుట. కావాలనే ఆ సబ్జెక్ట్ అటెండ్ చేయలేదుట. ఒకవేళ పాస్ అయితే ఇంట్లో తల్లిదండ్రులు, అన్నయ్య డిగ్రీ, బిటెక్ జాయిన్ అవ్వమంటారనే కారణంతోనే అలా చేసాడుట. అయితే ఫిల్మ్ స్కూల్ జాయిన్ కావాలన్నా? ఇంటర్మీడియట్ ఉండాలని అనడంతో తిరిగి ఆ సబ్జెక్ట్ రాసి పాస్ అయ్యాడుట.
ఫిల్మ్ స్కూల్ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎగ్జామ్ లోనూ ఫెయిలయ్యాడుట. దీంతో మళ్లీ డిగ్రీ చదవాలనే ఒత్తిడి మొదలైందట. అవకాశాలు రాకపోవడంతోనే బాగా ఒత్తిడి పెరిగిందన్నాడు. దీంతో టెన్త్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ లు ఉండటంతోనే ఈ సమస్య వస్తుందని వాటిని తగలబెట్టేసాడుట. అందుకో ఓ ఇనిస్ప్రేషన్ గా సినిమాలో సీన్ గురించి వివరించాడు.
శ్రీ విష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ 'బ్రోచేవారె వరురా' అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలా సర్టిఫికెట్లు చింపేసే సీన్ ఉంటుందన్నాడు. సినిమాలో ఆ సీన్ చూసే తాను కూడా అలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా చదువుకున్న డిగ్రీలు తగలబెట్టేసినట్లు గతంలో ఓ ఇంటరవ్యూలో రివీల్ చేసారు.