ఫోటో స్టోరి: నల్ల కోకలో మిల్కీ సోయగాల వల
తనదైన అందం, రూపలావణ్యంతో రెండు దశాబ్ధాల కెరీర్ ని సునాయాసంగా లాగించేసింది తమన్నా.;
అసలే మిల్కీ అందం.. ఆపై కొంటె చూపుల బాణాలు విసురుతోంది. అలా ఏటవాలుగా వెనక్కి చూస్తూ, నల్ల కోక సొగసును, సన్నజాజి నడుమును ఆవిష్కరిస్తోంది. ఆల్ బ్లాక్ లో మిల్కీ షైనీ లుక్స్ మతులు చెడగొడుతున్నాయి. ప్రియుడు విజయ్ వర్మ నుంచి బ్రేకప్ అయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో యూత్ ని డైవర్ట్ చేయడానికే ఈ ఫోటోషూట్ అని భావించాల్సి ఉంటుంది.
తనదైన అందం, రూపలావణ్యంతో రెండు దశాబ్ధాల కెరీర్ ని సునాయాసంగా లాగించేసింది తమన్నా. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకునే ప్రతిభావనిగా నిరూపించుకుంది. మిల్కీ అందం ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. మూడు చోట్లా మూడు ముక్కలాటలో ఆరితేరిపోయింది. మరోవైపు వెబ్ సిరీస్ లలోను అవకాశాలు అందుకుంటూ ఓటీటీ క్వీన్ గా సత్తా చాటుతోంది.
తమన్నా నటించిన `ఓదెలా 2` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో తమన్నా స్పీడ్ గా ఉంది. ఇటీవలే టీజర్ విడుదలై ఆకట్టుకుంది. దైవ శక్తి గురించిన చిత్రం `ఓదేలా2`. తమన్నా ఇటీవల ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో స్నానాదులు ఆచరించి, అనంతరం పూజల్లో తరించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వీలున్న ప్రతి వేదికపైనా తమన్నా టీమ్ ఓదెలా 2 కి ప్రచారం కల్పిస్తోంది.