విడిపోవ‌డం వెనుక ప్ర‌చారం రివ‌ర్స్ లో ఉందే!

అయితే వీడిపోవడానికి కార‌ణంగా విజ‌య్ వ‌ర్మ అంటూ మీడియాలో హైలైట్ అవుతుంది.;

Update: 2025-03-06 09:46 GMT

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా- విజ‌య్ వ‌ర్మ బ్రేక‌ప్ చెప్పుకున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెట్టి ఎవ‌రికి వారు కెరీర్ లో బిజీ అయిన‌ట్లు కొన్ని రోజులుగా మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి. ప్రేమికులుగా విడిపోయి స్నేహితులుగా మెల‌గాల‌ని ఇరువురు మ్యూచివ‌ల్ అండ్ స్టాడింగ్ చేసుకున్న‌ట్లు జ‌నాలంతా మాట్లాడుకుంటున్నారు.

అయితే వీడిపోవడానికి కార‌ణంగా విజ‌య్ వ‌ర్మ అంటూ మీడియాలో హైలైట్ అవుతుంది. పెళ్లి -కెరీర్ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలొచ్చిన‌ట్లు వినిపిస్తుంది. త‌మ‌న్నాపెళ్లిచేసుకుని కాపురం పెడుదామంటే? అందుకు విజ‌య్ వ‌ర్మ నో చెప్పాడిన‌...అందుకే త‌మ‌న్నా బ్రేక‌ప్ చెప్పింద‌ని అంటున్నారు. త‌మ‌న్నా పెళ్లి విష‌యాన్నిప్ర‌స్తావిస్తే...విజ‌య్ వ‌ర్మ కెరీర్ గురించి మాట్లాడుతున్నాడ‌ని ఇదే ఇద్ద‌రి మ‌ద్య మ‌నస్పర్దల‌కు దారి తీసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ ప్ర‌చారం కాస్త రివ‌ర్స్ లో కనిపిస్తుంది. గ‌తంలో చాలా ఇంట‌ర్వ్యూలో విజ‌య్ వ‌ర్మ పెళ్లికి రెడీగా...త‌మ‌న్నా సిద్దంగా లేద‌న్న వార్త వెలుగులోకి వ‌చ్చింది. విజ‌య్ వ‌ర్మ పెళ్లికి సిద్ద‌మా? అంటే తాను సిద్ద‌గా ఉన్నాన‌ని... త‌మ‌న్నాకెరీర్ మీద ఫోక‌స్ పెడుతుంద‌ని అందుకే ఆల‌స్య‌మ‌వుతుంద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. త‌మ‌న్నా పై విజ‌య్ వ‌ర్మ మ‌న‌సులో ప్రేమ‌ను చాలాసార్లు ఎంతో ఓపెన్ గా బ‌య‌ట పెట్టాడు.

కానీ త‌మన్నా మాత్రం ఈ విష‌యంలో అంత ఓపెన్ గా ఏ సంద‌ర్భంలోనూ మాట్లాడ‌లేదు. మ‌రి ఇప్పుడు జ‌రుగుతోన్న ప్ర‌చారంలో వాస్త‌వం ఏంటి? అన్న‌ది తెలియాలి. సాధార‌ణంగా విడిపోయిన త‌ర్వాత ర‌క‌ర‌కాల కార‌ణాలు తెర‌పైకి రావ‌డం స‌హ‌జం. ఎవ‌రి జీవితంలో వారు బిజీగా ఉంటే గ‌తాన్ని త‌వ్వ‌డం దేనికి అనే కోణంలో అస‌లు కారణాలు క‌నుమ‌రుగ‌వుతుంటాయి.

Tags:    

Similar News