కత్తి లాంటి జాన్వీ చేప

ఎన్టీఆర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర పార్ట్ 1 కమర్షియల్‌గా బిగ్ హిట్ కొట్టింది. కానీ సీక్వెల్ అయిన దేవర 2 తెరకెక్కుతుందా లేదా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు;

Update: 2025-03-06 10:08 GMT

ఎన్టీఆర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర పార్ట్ 1 కమర్షియల్‌గా బిగ్ హిట్ కొట్టింది. కానీ సీక్వెల్ అయిన దేవర 2 తెరకెక్కుతుందా లేదా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మేకర్స్ అధికారికంగా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినప్పటికీ, కొరటాల శివ మాత్రం పార్ట్ 2 స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

ఇక జాన్వీ కపూర్ ఈ సినిమాలో తంగం అనే పాత్రలో కనిపించినా, ఆమెకు పెద్దగా స్కోప్ లేదనే టాక్ ఎక్కువగా వచ్చింది. ఫస్ట్ పార్ట్‌లో ఆమె పాత్ర రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో చాలా సాధారణంగా ఉండటంతో కొంతమంది నిరాశపడ్డారు. అయితే దర్శకుడు కొరటాల శివ గత ఇంటర్వ్యూలో సెకండ్ పార్ట్‌లో జాన్వీ క్యారెక్టర్‌కు పెద్ద ప్రాధాన్యత ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.

అంటే దేవర 2 వస్తే, ఆమె పాత్ర మరింతగా బలంగా కనిపించే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇక జాన్వీ బర్త్‌డే సందర్భంగా దేవర టీమ్ రిలీజ్ చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నోట్లో కత్తిను పట్టుకుని, భుజంపై చేపను వేసుకుని ఉన్న లుక్ ఆమె పాత్రలో ఓ వైల్డ్ టచ్ ఉందని చెబుతోంది. ఇక జాన్వీ మరోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC16 చిత్రంలో కూడా లీడ్ రోల్ పోషిస్తోంది.

ఈ సినిమాలో ఆమె పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. దేవర లాంటి పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్ నుంచి స్పోర్ట్స్ డ్రామా జానర్‌లోకి అడుగుపెడుతూ, జాన్వీ ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. దేవర 1 కమర్షియల్ సక్సెస్ అయిన తర్వాత, దేవర 2 పవర్ఫుల్ స్క్రిప్ట్ తో వస్తే జాన్వీ దశ తిరిగినట్లే. మొత్తానికి దేవర 2 అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రాకపోయినా, తంగం పాత్రతో మేకర్స్ సౌండ్ చేసిన విధానం వైరల్ అవుతోంది.

Tags:    

Similar News