తెరపైకి కార్గిల్ వార్..ఛాన్స్ కొట్టేసిన సిద్దార్ద్!
దేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం `కార్గిల్ వార్` అన్న సంగతి తెలిసిందే. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ యుద్దంలో పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టేందుకు `ఆపరేషన్ సఫేద్ సాగర్` ను చేపట్టింది భాతర వైమానిక దళం.;
దేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం `కార్గిల్ వార్` అన్న సంగతి తెలిసిందే. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ యుద్దంలో పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టేందుకు `ఆపరేషన్ సఫేద్ సాగర్` ను చేపట్టింది భాతర వైమానిక దళం. అయితే ఇప్పుడీ ఘట్టాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్దమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ ఆ బాధ్యతలు తీసుకుంటుంది. `ఆపరేషన్ సఫేద్ సాగర్` టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.
అయితే ఇందులో నటించే అవకాశం సిద్దార్ధ్ కు దక్కింది. ఇంకా జమ్మీ షేర్గిల్, అభయ్ వర్మ, మిహిర్ అహుజా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కార్గిల్ వార్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లింది? కష్ట కాలంలో సైనిక సిబ్బంది చూపించిన ధైర్య సాహసాలు ఏంటి? దేశం కోసం ప్రాణాలు అర్పిచింని సైనికుల జీవితాలను కళ్ల ముందు ఆవిష్కరించబోతున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే అధికారికంగా అన్ని వివరాలు వెల్లడిం చనున్నారు. ఇక నటుడిగా సిద్దార్ద్ కిది మంచి అవకాశం. ఇలాంటి అవకాశం రావడం అంత సులభం కాదు. ఇప్పటికే సిద్దార్ద్ కెరీర్ చరమాంకంలో ఉంది. సినిమా అవకాశాలు అడపా దడపా వస్తున్నాయి. అదీ తమిళ్ లోనే. `మహా సముద్రం` తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో వెబ్ సిరీస్ ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అడపా దడపా అక్కడ సిరీస్ లు చేస్తున్నాడు. కానీ వాటిలోనూ ఇప్పటి వరకూ అంతగా ఫేమస్ కాలేదు. అతడి ట్యాలెంట్ కి తగ్గ స్టోరీ పడక పోవడంతో? ఎఫెర్ట్అంతా వృద్ధా ప్రయత్నంగా మారిపోతుంది. అయితే కార్గిల్ వార్ లో మాత్రం బలమైన పాత్ర పోషిస్తున్నాడు. యూనివర్శల్ అప్పీల్ ఉన్న స్టోరీ కాబట్టి సక్సెస్ అయితే మంచి పేరు వస్తుంది.