సీక్వెల్ ప్ర‌య‌త్నంపై విమ‌ర్శ‌లు..ట‌చ్ చేసి త‌ప్పు చేస్తున్నాడా?

విజ‌య్ సేతుప‌తి-త్రిష జంట‌గా ప్రేమ్ కుమార్ తెర‌కెక్కించిన `96` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే.;

Update: 2025-03-06 14:30 GMT

విజ‌య్ సేతుప‌తి-త్రిష జంట‌గా ప్రేమ్ కుమార్ తెర‌కెక్కించిన `96` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. క‌ల్ట్ ల‌వ్ స్టోరీల్లో 96 ఒక‌టిగా నిలిచింది. సేతుప‌తి-త్రిష‌ల‌కు ఈ సినిమా మంచి పేరు తీసు కొచ్చింది. అలా ముగ్గురి కెరీర్లో ఇదే మైలు రాయిలా నిలిచిన చిత్రం. ఇలాంటి క్లాసిక్ ల‌వ్ స్టోరీల‌ను ట‌చ్ చేయాలంటే? మ‌ళ్లీ అంత‌టి ధైర్యం వాళ్లే చేయాలి. ఇప్ప‌టికే ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్న‌ట్లు ప్రేమ్ కుమార్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. తాజాగా ఈసినిమా నిర్మాణ సంస్థ పేరు తెర‌పైకి వ‌చ్చింది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 96ని మ‌ద్రాస్ ఎంట‌ర్ ప్రైజ‌స్ నిర్మించింది. కానీ సీక్వెల్ నిర్మించే ఛాన్స్ మాత్రం ఆ సంస్థ తీసుకోలేదు. బ‌య‌ట సంస్థ‌కు హ‌క్కులు అమ్మేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే 96 సీక్వెల్ పై మ‌రో విమ‌ర్శ కూడా ఉంది. ఇలాంటి కల్ట్ సినిమాల‌కు సీక్వెల్స్ ఉండ‌కూడ‌ద‌ని కొంత మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వాటిని ట‌చ్ చేయ‌కుండా అలా వ‌దిలేస్తేనే సినిమా చ‌రిత్ర‌లో గొప్ప‌గా నిలిచిపోతాయంటున్నారు. సీక్వెల్ తీసి ఫెయిలైతే? మాతృక‌కు చెడ్డ పేరు తెచ్చినట్లు అవుతుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. పైగా కోలీవుడ్ లో సీక్వెల్స్ స‌క్సెస్ రేట్ కూడా పెద్ద‌గా లేదు. సీక్వెల్ ప్ర‌య‌త్నాలేవి అక్క‌డ ఫ‌లించ‌లేద‌ని విమ‌ర్శ ఉంది. అయితే ప్రేమ్ కుమార్ వాటిని ప‌ట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు.

`96` అభిమానుల కోసం ఈ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఈసీక్వెల్ లో విజ‌య్ సేతుప‌తి- త్రిష న‌టిస్తున్నారా? కొత్త న‌టీన‌టుల‌తో ముందుకెళ్తున్నారా? అన్న‌ది క్లారిటీ లేదు. ఇలాంటి ల‌వ్ స్టోరీలో పాత న‌టీన‌టుల‌కంటే కొత్త వాళ్లు అయితేనే బాగుటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ వుతున్నాయి.`96` ని తెలుగులో `జాను` టైటిల్ తో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇక్క‌డ పెద్ద స‌క్సెస్ అవ్వ‌లేదు.

Tags:    

Similar News