సంక్రాంతి కంటెంట్ తో రవితేజ!
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమా పొంగల్ హిట్టుగా 300 కోట్లు రాబట్టింది.;
మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లో ఎప్పుడూ వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టే హీరోల్లో ఒకరు. కమర్షియల్ సినిమాలతో పాటు కొత్త జానర్‌లను ఎక్స్‌ప్లోర్ చేయడం కూడా ఆయన స్పెషాలిటీ. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈసారి రవితేజ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ పర్ఫెక్ట్ కంటెంట్ సినిమాను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమా పొంగల్ హిట్టుగా 300 కోట్లు రాబట్టింది.
సంక్రాంతి టైమ్ లో మంచి ఫ్యామిలీ కామెడీ సినిమా పడితే ఎలా ఉంటుందో వెంకీ అనిల్ కాంబో నిరూపించింది. ఇక ఇప్పుడు అదే ఫార్ములాతో మాస్ రాజా కాంబో సెట్ చేస్తున్నట్లు టాక్. దర్శకుడు కిషోర్ తిరుమలతో రవితేజ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతోంది.
అయితే ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించనున్నట్లు తెలుస్తోంది. వాంటెడ్, జవాన్ సినిమాలతో డిజాస్టర్ అందుకున్న దర్శకుడు రవి అంతకుముందు రైటర్ గా రవితేజ సినిమాలకు వర్క్ చేశాడు. ఇక ఇప్పుడు రవితేజను ఎట్రాక్ట్ చేసే కథ అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రవితేజ నటించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాల కంటే ఇది పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉండనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా కథ ప్రత్యేకంగా నిలుస్తుందని ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇంట్లో ఇల్లాలు, వంటంట్లో ప్రియురాలు - సంక్రాంతికి వస్తున్నాం.. లాంటి షేడ్స్ ఉన్న కథ అనే టాక్ వస్తోంది, అది సరైన కమర్షియల్ ట్రీట్మెంట్‌తో రాబోతుందని అంటున్నారు. ఓ వ్యక్తి కుటుంబ జీవితం, అతని రొమాంటిక్ కోణం, ఈ రెండింటి మధ్య వచ్చే మజా, ఎమోషన్స్, కన్ఫ్లిక్ట్‌ను కిషోర్ తిరుమల తన స్టైల్‌లో చూపించబోతున్నారని సమాచారం.
కిషోర్ తిరుమల గతంలో రామ్‌తో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి ఎమోషనల్, ఫీల్-గుడ్ ఫిల్మ్స్ చేశారు. అలాగే రవితేజతో గతంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకు స్క్రిప్ట్ అందించిన బీవీఎస్ రవి, ఈసారి డిఫరెంట్ స్టోరీతో వచ్చారని తెలుస్తోంది. రవితేజకి కొత్త యాంగిల్ చూపించేలా ఈ కథ ఉండబోతోందని టాక్. ఇక ఈ సినిమా సంక్రాంతి 2026 విడుదలకు సిద్ధమవుతోందని సమాచారం. రవితేజ గతంలో సంక్రాంతి బరిలో ‘క్రాక్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే సీజన్‌లో ఈ కొత్త కాన్సెప్ట్‌తో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. మాస్ మహారాజా మరోసారి తన మ్యాజిక్ చూపిస్తారా అన్నది చూడాలి.