సూరి ప్లాన్ ఏంటి? వ్యూహం ఎలా ఉండ‌బోతుంది?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా ఉంది కానీ, అదెప్పుడు? మొద‌ల‌వుతుందో తెలియ‌ని ప‌రిస్థితి.;

Update: 2025-03-06 17:30 GMT

'ఏజెంట్' రిలీజ్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి ఒక్క‌సారిగా సైలైంట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్ర‌క‌టించ‌లేదు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా ఉంది కానీ, అదెప్పుడు? మొద‌ల‌వుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ ప్రాజెక్ట్ పై సూరి కూడా అంత న‌మ్మ‌కం పెట్టుకోలేదు. ప‌వ‌న్ లైన‌ప్ లో ఉన్న చిత్రాలే పూర్తి కాని నేప‌థ్యంలో? త‌న సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందో త‌న‌కే తెలియ‌ని ప‌రిస్థితి.

విక్ట‌రీ వెంక‌టేష్ తో ఓ సినిమా చేస్తారనే ప్ర‌చారం ఉంది గానీ సూరి ఉన్న ప‌రిస్థితుల్లో? వెంక‌టేష్ అత‌డితో సినిమా చేస్తాడా? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో సూరి వ్యూహం ఎలా ఉండ‌బోతుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోలంతా బిజీగా ఉన్నారు. రామ్ చ‌ర‌ణ్‌, మ‌హ‌ష్‌, ప్ర‌భాస్, ఎన్టీఆర్, బ‌న్నీ ఇలా అంతా వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇప్ప‌ట్లో సూరి వాళ్ల‌కు స్టోరీ వినిపించే ప‌రిస్థితి కూడా లేదు. ఇక టైర్ 2 హీరోలు కూడా చాలా మంది బిజీగా ఉన్నారు. వాళ్లు అంతా పాన్ ఇండియా క‌థ‌లంటూ తిరుగుతున్నారు. సూరికి ఇంత‌వ‌ర‌కూ పాన్ ఇండియా సినిమా తీసిన అనుభ‌వం లేదు. రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో సూరి తీసిన సినిమాలు కేవ‌లం ప‌ది మాత్ర‌మే. అందులో ఆరు సినిమాలు పెద్ద విజ‌యం సాధించాయి. సైరా న‌రసింహారెడ్డి లాంటి చారిత్రాత్మ‌క చిత్రం మేక‌ర్ గా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

చ‌రిత్ర‌ల‌ను కూడా అద్భుతంగా తీయ‌గ‌ల‌డు అనే న‌మ్మకం ఆసినిమాతో ఇండ‌స్ట్రీకి ఇచ్చాడు. మ‌రి ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినారే నేప‌థ్యంలో సూరి అలాంటి క‌థ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అందుకే ఇంత గ్యాప్ తీసుకున్నాడా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

Tags:    

Similar News