క్యాన్స‌ర్ పై శివ‌రాజ్ కుమార్ డాక్యుమెంట‌రీ!

ఇటీవ‌లే క‌న్న‌డ న‌టుడు శివ రాజ్ కుమార్ కూడా క్యాన్స‌ర్ కి సంబంధించి విదేశాల్లో చికిత్స తీసుకుని కోలుకుంటున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-03-06 19:30 GMT

క్యాన్స‌ర్ బారిన ప‌డిన సెల‌బ్రిటీలు తిరిగి కోలుకున్న త‌ర్వాత అవేర్ నెస్ కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొం టున్న సంగ‌తి తెలిసిందే. మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? క్యాన్స‌ర్ రోగుల ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రించాలి? వంటి అంశాల‌పై ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు చేయాల్సిందంతా చేసారు. ఇటీవ‌లే క‌న్న‌డ న‌టుడు శివ రాజ్ కుమార్ కూడా క్యాన్స‌ర్ కి సంబంధించి విదేశాల్లో చికిత్స తీసుకుని కోలుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మ‌హ‌మ్మారిపై ఆయ‌న పోరాటాన్ని తెలియ‌జేసేలా ఓ డాక్యుమెంట‌రీకి సంక‌ల్పించారు. ఇందులో వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, బాధితుల్లో ధైర్యాన్ని నింపాల‌నే ఉద్దేశంతో డాక్యుమెంట‌రీ చేస్తున్నారు. అమెరికాలో చికిత్స తీసుకున్న స‌మ‌యంలో డాక్ట‌ర్లు నాకెంతో అండ‌గా నిలిచారు. క్యాన్స‌ర్ పై నా పోరును డాక్యుమెంట‌రీ తీస్తే చాలా మందిలో ధైర్యాన్ని పెంచొచ్చు అని వారు భావించారు. ఈ విష‌యాన్ని నాతో చెప్పారు` అని శివ‌రాజ్ కుమార్ అన్నారు.

దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా శివ‌న్న‌ను ఉద్దేశించి అభిమానులు పోస్టులు పెడుతున్నారు. క్యాన్స‌ర్ జ‌యించిన మీలాంటి వారు మ‌రిన్ని అవేర్ నెస్ కార్య‌క్రమాలు చేప‌ట్టాల‌ని కోరుతున్నారు. సామాజిక సేవ‌లో శివ‌న్న ఫ్యామిలీ ముందుంటుంద‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఎన్నో చారిటీలు నిర్వ‌హిస్తున్నారు. అనాధ పిల్ల‌ల‌కు, వృద్దుల‌కు, విద్యార్ధుల‌కు తాము చేయాల్సింద‌ల్లా చేస్తున్నారు.

ఇలాంటి విష‌యాల్లో దివంగ‌త న‌టుడు పునీత్ రాజు కుమార్ మ‌రింత దాతృహృద‌యంతో వ్య‌వ‌హ‌రిం చేవారు. ఆయ‌న మ‌రణానంత‌రం కొంద‌రు పిల్ల‌ల బాధ్య‌త‌ల్ని న‌టుడు విశాల్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News