ఎన్టీఆర్ సినిమా కోసం విజయ్ ప్రాజెక్ట్ ను వదిలేసి..

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.;

Update: 2025-03-06 20:30 GMT

టాలీవుడ్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్‌ల లైనప్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్‌డమ్’ సినిమాతో బిజీగా ఉండగా, మరో వైపు ‘రౌడీ జనార్ధన్’ అనే ఇంట్రెస్టింగ్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రవికిరణ్ కొలా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ ప్రాజెక్ట్‌కి హీరోయిన్‌గా రుక్మిణి వాసంత్‌ని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కన్నడ బ్యూటీ, విజయ్ సరసన రొమాంటిక్ ఇంట్రెస్ట్‌గా కనిపించనుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ‘రౌడీ జనార్ధన్’ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. దీంతో ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్‌ని వెతికే పనిలో ఉన్నారు మేకర్స్.

రుక్మిణి ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉండటంతో విజయ్ మూవీకి డేట్స్ కేటాయించలేకపోయిందట. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్న ఈ భామ, ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

రుక్మిణి వాసంత్ కెరీర్‌ను చూస్తే, ఆమె యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందం, అభినయం కలబోసిన ఈ నటి, విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తే కొత్త జోడీ చూడొచ్చనే క్యూరియాసిటీ పెరిగింది. కానీ ఇప్పుడు ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ‘రౌడీ జనార్ధన్’ను చేయలేకపోతోంది. ఇప్పుడు మేకర్స్ ఆమె స్థానంలో మరో యంగ్ హీరోయిన్‌ని తీసుకునే యోచనలో ఉన్నారని టాక్.

కొత్తగా వచ్చిన రీసెంట్ నాయికలలో ఎవరు ఈ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ దక్కించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌లో ఎప్పుడూ ఫ్రెష్ జోడీలను చూసే ఆసక్తి ప్రేక్షకులలో ఎక్కువగా ఉంటుంది. దాంతో ‘రౌడీ జనార్ధన్’లో ఎవరు కథానాయికగా ఎంపిక అవుతారనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం భిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో వైవిధ్యం చూపిస్తున్నాడు. ‘కింగ్‌డమ్’ తరువాత ‘రౌడీ జనార్ధన్’ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఇప్పటికే ఏర్పడింది. అలాగే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కూడా విజయ్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Tags:    

Similar News