ప్లాప్ ల్లో ఉన్న పూరితో ఛాన్స్ తీసుకుంటారా?
తదుపరి ఏ హీరోతో సినిమా చేస్తారు? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు.;
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎలాంటి ఫేజ్ లో ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' తో రెండు భారీ ప్లాప్ లు అందుకున్నారు. తదుపరి ఏ హీరోతో సినిమా చేస్తారు? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. మ్యాచో స్టార్ గోపీచంద్ పేరు వినిపిస్తుంది కానీ కన్పర్మేషన్ లేదు. గోపీచంద్ కూడా ప్లాప్ ల్లోనే ఉన్నాడు. ఫాంలో ఉన్న డైరెక్టర్లు అంతా హిట్ ఉన్న హీరోలవైపే చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పూరి-గోపీ మళ్లీ కలుస్తున్నారు? అనే ప్రచారానికి బలం చేకూరుతుంది. అయితే ఇంతలోనే మరో ప్రచారం కూడా తెరపైకి వస్తుంది. అక్కినేని వారసుడు అఖిల్ తో పూరి ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఆ ఛాన్స్ తీసుకుంటుంది కూడా కింగ్ నాగార్జున అనే అంటున్నారు. అకిల్ ఇప్పటి వరకూ సరైన మాస్ సినిమా తీయలేదు. లవ్ స్టోరీలు చేసాడు.
ఏజెంట్ తో యాక్షన్ సినిమా చేసాడు. పైగా ఈ సినిమా అంచనాలు కూడా అందుకోలేదు. దీంతో నాగార్జున ఓ అటెంప్ట్ పూరితో చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నాడుట. అలాగని ఈ చిత్రం ఇప్పటికిప్పుడు పట్టాలెక్కించేది కాదు. అకిల్ కోసం ఓ మంచి మాస్ స్టోరీ సిద్దం చేయమని పూరికి నాగ్ సంకేతాలిచ్చినట్లు మాత్రమే తెలిసింది. మరి అది జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి.
ప్రస్తుతం అకిల్ `వినరో భాగ్యము విష్ణుకథ` ఫేమ్ మురళికిషోర్ దర్శకత్వంలో 'లెనిన్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అన్నిపనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే యూవీ క్రియేషన్స్ లో కూడా అఖిల్ ఓ సినిమా చేయాల్సింది. అనీల్ అనే కొత్తకుర్రాడ్నిపరిచయం చేస్తూ యూవీ ఈ సినిమా ప్లాన్ చేస్తోంది. లెనిన్ తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాతే పూరి నాగ్ ని స్టోరీతో మెప్పిస్తే అకిల్ తో ఛాన్స్ ఉండొచ్చు.