క‌యాదు సెల‌బ్రిటీ క్ర‌ష్ ఎవ‌రో తెలుసా?

సోష‌ల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్క‌డ చూసినా క‌యాదుకి సంబంధించిన ఫోటోలు, వీడియోలే క‌నిపిస్తున్నాయి.;

Update: 2025-03-07 06:19 GMT

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు క‌యాదు లోహ‌ర్. రీసెంట్ గా డ్రాగ‌న్ మూవీతో ఆడియ‌న్స్ ను అల‌రించిన ఈ అస్సాం బ్యూటీ సౌత్ ఇండ‌స్ట్రీలో బాగా బిజీ అయిపోయింది. డ్రాగ‌న్ మూవీలో క‌యాదు అందానికి, చిలిపిత‌నానికి యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. సోష‌ల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్క‌డ చూసినా క‌యాదుకి సంబంధించిన ఫోటోలు, వీడియోలే క‌నిపిస్తున్నాయి.

త‌క్కువ టైమ్ లోనే యూత్ మ‌న‌సుల్ని కొల్ల‌గొట్టి క్ర‌ష్ గా మారిన క‌యాదుకి సెల‌బ్రిటీ క్ర‌ష్ ఎవ‌రో తెలుసా? రీసెంట్ గా త‌మిళ‌నాడులోని ఓ ఈవెంట్ లో అమ్మ‌డిని ఈ ప్ర‌శ్న అడ‌గ్గా అమ్మ‌డు చెప్పిన ఆన్స‌ర్ ఇప్పుడు నెట్టింట వైర‌ల‌వుతోంది. త‌న సెల‌బ్రిటీ క్ర‌ష్ ద‌ళ‌ప‌తి విజ‌య్ అని, అందులో ఎలాంటి డౌట్ లేద‌ని అమ్మ‌డు తెలిపింది.

ద‌ళ‌ప‌తి త‌న క్ర‌ష్ అని చెప్పిన క‌యాదు, విజ‌య్ సినిమాలన్నింటిలో త‌న‌కు తేరి సినిమా అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పింది. అంతేకాదు, అదే ఈవెంట్ లో క‌యాదు విజ‌య్ ఫేమ‌స్ సాంగ్ అపిడి పోడే పొడే సాంగ్ కు స్టేజ్ మీద డ్యాన్స్ వేసి అల‌రించింది. దీంతో విజ‌య్ ఫ్యాన్స్ ఆ వీడియోను వైర‌ల్ చేస్తున్నారు. డ్రాగ‌న్ మూవీ ప్ర‌మోష‌న్స్ టైమ్‌లో టాలీవుడ్ లో త‌న‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇష్ట‌మ‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ముగిల్ పేటె అనే కన్న‌డ సినిమాతో సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైన క‌యాదు ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో ఓ మూవీ చేసింది. అల్లూరి సినిమాతో టాలీవుడ్ లోకి ఇప్ప‌టికే ఎంట్రీ ఇచ్చిన క‌యాదుకి ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు డ్రాగ‌న్ హిట్ అవ‌డంతో అమ్మ‌డికి ఒక్క‌సారిగా క్రేజ్ పెరిగింది. ప్ర‌స్తుతం క‌యాదు, విశ్వ‌క్ సేన్ స‌ర‌స‌న ఫంకీ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News