వీడియో: బెబో - షాహిద్ జంట షాకిచ్చారేమిటీ?

మాజీ క‌పుల్ కరీనా కపూర్ -షాహిద్ కపూర్ ఒకే వేదిక‌పైకి రావ‌డ‌మే గాక‌.. చాలా కాలం త‌ర్వాత ఆ ఇద్ద‌రూ మ‌న‌స్ఫూర్తిగా మాట్లాడుకుంటూ క‌నిపించారు.;

Update: 2025-03-09 03:50 GMT

ఈ జంట ఒక‌ప్పుడు ప్రేమ‌కు నిర్వ‌చ‌నం. విడ‌దీయ‌లేనంత గొప్ప ప్రేమికులు. ప్రేమ జంట ఎలా ఉండాలి? అనే దానికి ఎగ్జాంపుల్ గా క‌నిపించేవారు. క‌లిసి షికార్లు చేశారు. ప్రేమ అన్యోన్య‌త‌లో వారు అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచారు. కానీ కాల‌క్ర‌మంలో ఈ జంట విడిపోవ‌డం బ్రేకింగ్ న్యూస్ గా మారింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా, అనూహ్యంగా బ్రేక‌ప్ అయింది. కెరీర్ కోసం ఎవ‌రి దారిలో వారు వెళ్లారు. చివ‌రికి చెరో దారిలో పెళ్లి చేసుకుని సెటిల‌య్యారు. ఈ జంట మ‌రెవ‌రో కాదు షాహిద్ క‌పూర్- బెబో క‌రీనా క‌పూర్. షాహిద్ దిల్లీ అమ్మాయి మీరా రాజ్ పుత్ ని పెళ్లాడ‌గా, బెబో క‌రీనా త‌న‌కంటే వ‌య‌సులో చాలా పెద్ద వాడైన సైఫ్ ఖాన్ ని పెళ్లాడి లైఫ్‌లో సెటిలైంది.

అయితే ఇంత దూరం ప్ర‌యాణించాక‌, మాజీ జంట తిరిగి క‌లుసుకునే ఒక్క సంద‌ర్భం కూడా రాలేదు. ఎట్ట‌కేల‌కు జైపూర్‌లో జరిగిన IIFA 2025 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఊహించ‌ని ఘ‌ట‌న క‌ళ్లు తిప్పుకోనివ్వ‌లేదు. మాజీ క‌పుల్ కరీనా కపూర్ -షాహిద్ కపూర్ ఒకే వేదిక‌పైకి రావ‌డ‌మే గాక‌.. చాలా కాలం త‌ర్వాత ఆ ఇద్ద‌రూ మ‌న‌స్ఫూర్తిగా మాట్లాడుకుంటూ క‌నిపించారు.

హృదయాల్ని క‌దిలించే అరుదైన దృశ్య‌మిది. ఒకప్పుడు జబ్ వి మెట్‌లో తమ కెమిస్ట్రీతో తెర‌ను మ‌రిగించిన ఈ ఇద్దరు మాజీలు, ఇతరులు చూస్తుండగా ఒకరినొక‌రు హ‌గ్ చేసుకుని ఉత్సాహంగా మాట్లాడుకుంటూ క‌నిపించారు. ఈ దృశ్యం అభిమానులను ఉత్సాహపరిచింది, చాలా మంది ఈ జంట‌ విడిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా తిరిగి క‌లుసుకోవ‌డం మాట్లాడుకోవ‌డంపై ఆశ్చర్యం వ్య‌క్తం చేసారు.

ప్రియమైన గీత్ - ఆదిత్య (జబ్ వి మెట్‌లోని పాత్రలు) తిరిగి కలుసుకోవడాన్ని అభిమానులు స్క్రీన్ ల‌వ్ ని గుర్తుచేసుకున్నారు. చివరకు పరిణతి చెందిన వ్యక్తుల్లా ఉన్నారు! అని ఒక‌ అభిమాని రాశాడు. నా కళ్ళను నమ్మలేకపోతున్నాను, జబ్ వి మెట్ ఎగైన్! అని వ్యాఖ్యానించారు.

కరణ్ జోహార్, కార్తీక్ ఆర్యన్, కృతి సనన్, బాబీ డియోల్, మాధురీ దీక్షిత్ వంటి బాలీవుడ్ తారలు హాజరైన ఈ కార్యక్రమంలో, షాహిద్ - కరీనా కాలం ఆగిపోయిందా! అన్న‌ట్టుగా, సంభాషించుకుంటూ కనిపించారు. కరణ్ జోహార్‌ను కౌగిలించుకున్న కరీనా, తన మాజీతో క్లుప్తంగా మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. జబ్ వి మెట్ చిత్రంలో గీత్ పాత్రను పోషించమని తనను ప్రోత్సహించింది షాహిద్ అని కరీనా ఒక పాత ఇంటర్వ్యూలో వెల్లడించింది, ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. సినిమా విడుదలకు ముందే వారు విడిపోయినా కానీ, ఆ జంట వ్యక్తిగత విజయాన్ని సాధించింది.

Tags:    

Similar News