సాయి పల్లవి ఎప్పుడు కనిపిస్తుంది..?

ఐతే తండేల్ తో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి నెక్స్ట్ సినిమా ఏం చేస్తుందో అని ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.;

Update: 2025-03-09 03:15 GMT

కథలను ఎంపిక చేసుకోవడమే కాదు వాటిలో తన అభినయంతో అలరిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది సహజ నటి సాయి పల్లవి. మలయాళ ప్రేమమ్ తో అదరగొట్టిన అమ్మడు తెలుగులో ఫిదా అంటూ మొదలు పెట్టి లేటెస్ట్ గా వచ్చిన తండేల్ వరకు సాయి పల్లవి సినిమాలో ఉంటే ఆ లెక్క వేరే అనేలా క్రేజ్ తెచ్చుకుంది. ప్రతి సినిమాలో తన పాత్రతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తుంది అమ్మడు. ఐతే తండేల్ తో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి నెక్స్ట్ సినిమా ఏం చేస్తుందో అని ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తుంది. అక్కడ ఏక్ దిన్, రామాయణం కథలతో అలరించబోతుంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక తప్పకుండా సాయి పల్లవి బాలీవుడ్ లో కూడా బిజీ అవుతుందని చెప్పొచ్చు. ఇక సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాల్లో సాయి పల్లవి మళ్లీ ఇప్పుడప్పుడే చూడటం కష్టమని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు నచ్చే కథలు రావట్లేదని టాక్.

సాయి పల్లవి ని ఊహించుకుని కథలు రాసే రేంజ్ కి ఆమె వెళ్లినా కొన్ని కథలు విన్నా కూడా అవి అంతగా ప్రభావం చూపించట్లేదని చెప్పి నో చెప్పేసిందట. అందుకే సాయి పల్లవి ఓకే చెప్పింది అంటే సినిమా సూపర్ హిట్ అన్నట్టే ఫిక్స్ అవ్వొచ్చు. ఇదిలా ఉంటే నితిన్ హీరోగా బలగం వేణు డైరెక్షన్ లో నెక్స్ట్ ఎల్లమ్మ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ లో సాయి పల్లవిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

దిల్ రాజు సినిమా కాబట్టి సాయి పల్లవి నో చెప్పే ఛాన్స్ లేదు. సో ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉండగా నెక్స్ట్ ఇయర్ సాయి పల్లవిని తెర మీద చూసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సాయి పల్లవి ఆ సినిమా చేయకపోతే మాత్రం ఆమెను తెలుగు తెర మీద మరింత లేట్ గా చూసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. నితిన్ తో సాయి పల్లవి ఇదివరకు కూడా ఈ కాంబో చేయాల్సింది కానీ కుదరలేదు. మరి ఎల్లమ్మకు సాయి పల్లవి సైన్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. బాలీవుడ్ లో తప్ప సాయి పల్లవి నెక్స్ట్ సినిమా ఎక్కడ కమిట్ అవ్వలేదు. మరి అమ్మడు ప్లానింగ్ ఎలా చేస్తుందో కానీ అమ్మడి ఫ్యాన్స్ మాత్రం సాయి పల్లవి ఎంత త్వరగా సినిమా చేస్తే అంత త్వరగా చూసేయాలని ఆసక్తిగా ఉన్నారు.

Tags:    

Similar News