కోనసీమలో పెళ్లికి ఎన్టీఆర్ ఫ్యామిలీ.. పెళ్లి ఎవరిదంటే
కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలంలోని చాకలి పాలెంలో జరిగిన పెళ్లికి నందమూరి కుటుంబం హాజరైంది;
జూ. ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం ఓ పెళ్లి కోసం కోనసీమలో ప్రత్యక్షమైంది. కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలంలోని చాకలి పాలెంలో జరిగిన పెళ్లికి నందమూరి కుటుంబం హాజరైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్2 షూటింగ్ లో ఉండటం వల్ల ఆయన ఈ పెళ్లికి వెళ్లలేదు. కానీ తన కుటుంబం మొత్తాన్ని ఎన్టీఆర్ పెళ్లికి పంపాడు.
ఎన్టీఆర్ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి తో పాటూ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యాడు. సెలబ్రిటీలంతా రావడంతో ఈ పెళ్లి బాగా హైలైట్ అయింది. అయితే ఎన్టీఆర్ వెళ్లకపోయినా ఈ పెళ్లికి తన ఫ్యామిలీని పంపాడంటే అవతల ఉన్నది ఎంత ముఖ్యమైన వాళ్లో అర్థమవుతుంది.
ఎన్టీఆర్ ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కూతురు పెళ్లి కోసం వారంతా కోనసీమకు వెళ్లారు. ఆస్థాన సిద్ధాంతి అంటే ఎంతో పరిచయంతో పాటూ వారికి ఎంతో గౌరవమిస్తారు. అందుకే పెళ్లికి తాను వెళ్లకపోయినా ఫ్యామిలీని పంపాడు ఎన్టీఆర్. పెళ్లికి హాజరైన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తల్లి, భార్య నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదే పెళ్లికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా హాజరయ్యారు.