ఆల‌స్యం ఆ సినిమాపై విషంగా మారుతుందా!

కానీ ఇంత వ‌ర‌కూ రిలీజ్ కాలేదు. ఇప్ప‌టికే ఎన్నోసార్లు రిలీజ్ తేదీలు వాయిదా ప‌డ్డాయి. ఇప్ప‌టికీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేదు.;

Update: 2025-03-06 09:30 GMT

ఆల‌స్యం అమృతం విషం అంటారు. మ‌రి ఇప్పుడీ సామెత `హ‌రి హ‌ర‌వీర‌మ‌ల్లు`కు స‌రిపోతుందా? అంటే నెట్టింట అలాంటి ప్ర‌చార‌మే జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ‌-క్రిష్ మొద‌లు పెట్టిన ఈ ప్రాజెక్ట్ సెట్స్ కి వెళ్లి సంవ‌త్స‌రాలు గ‌డుస్తుంది. కానీ ఇంత వ‌ర‌కూ రిలీజ్ కాలేదు. ఇప్ప‌టికే ఎన్నోసార్లు రిలీజ్ తేదీలు వాయిదా ప‌డ్డాయి. ఇప్ప‌టికీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేదు.

ఇంకా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాలుగు రోజులు సెట్స్ కి వెళ్తే త‌ప్ప షూటింగ్ పూర్తి కాదు. అదెప్పుడు జ‌రుగుతుందో తెలియ‌దు. మూడు నెల‌లుగా ఇదే తంతు న‌డుస్తోంది. అయినా మేక‌ర్స్ మాత్రం మార్చి 28న ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌చ్చేస్తున్నాం అంటూ ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతున్నారు. మ‌రి ఇది జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి. కానీ ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా రిలీజ్ కాక‌పోవ‌డంతో ఈ ర‌క‌మైన ఆల‌స్యం ఆ సినిమా వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

సాధార‌ణంగా రిలీజ్ ఆల‌స్య‌మైతే వ‌సూళ్ల పై ఇంపాక్ట్ ఉంటుంద‌ని చాలా మంది భావిస్తారు. అందుకే రిలీజ్ తేదీలు ప్ర‌క‌టించే విష‌యంలో అన్ని విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌క‌టిస్తుంటారు. అయినా కొన్నిసార్లు రిలీజ్ లు అన్న‌వి స‌వ్యంగా జ‌ర‌గ‌వు. అలా జ‌ర‌గ‌ని చాలా సినిమాల‌కు స‌క్స‌స్ రేట్ కూడా త‌క్కువ‌గానే ఉంది. ఇక వీర‌మ‌ల్లు విష‌యానికి వ‌స్తే రిలీజ్ ఆల‌స్యం అన్న‌ది ఆసినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తోంది.

సినిమాకు తొలుత క్రియేట్ అయిన బ‌జ్ ఇప్పుడు అంత‌గా లేదంటున్నారు. రోజు రోజుకు సినిమాపై అభిమానులే అంచ‌నాలు త‌గ్గించుకుంటున్నార‌నే స‌దేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స్టోరీ ఔడెటెడ్ అయిపోతుందా? అన్న అనుమానం వ్య‌క్త‌మ‌వుతుంది. ఎందుకంటే ఇది కూడా మోఘ‌ల్ సామ్రాజ్యానికి సంబంధించిన క‌థ‌గా హైలైట్ అవుతుంది. ఇప్ప‌టికే ఇదే బ్యాక్ డ్రాప్లో `ఛావా `రిలీజ్ అయి స‌క్స‌స్ అయింది.

దీంతో వీర‌మ‌ల్లులో ఇంకెలాంటి పాత్ర‌లు క‌నిపిస్తాయి? స్టోరీ ఎలా ఉంటుంది? అన్న ఎగ్జైట్ మెంట్ తో పాటు కొత్త‌గ ఏం చెప్ప‌బోతున్నారు? అన్న పాయింట్ కూడా నెట్టింట హైలైట్ అవుతుంది. వీర‌మ‌ల్లుకు ప‌వ‌న్ ఇమేజ్ తో భారీ ఓపెనింగ్స్ ద‌క్కినా లాంగ్ ర‌న్ లో అదే దూకుడు చూపించ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న తెర‌పైకి వ‌స్తుంది. ఈ సినిమాకి ప‌బ్లిసిటీ కూడా అత్యంత కీల‌కం అంటున్నారు.

Tags:    

Similar News