లవ్ స్టోరీ పాటల మీద స్పెషల్ ఫోకస్..!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మహేష్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ మీద ఉంది.;
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మహేష్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ మీద ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ ని మ్యూజిక్ డైరెక్టర్స్ ద్వయం వివేక్, మెర్విన్ అందిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తున్న వివేక్ మెర్విన్ తెలుగులో రాం సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు.
లవ్ స్టోరీగా వస్తున్న రాం 22 సినిమాలో సాంగ్స్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయట. లవ్ స్టోరీ కాబట్టి వివేక్, మెర్విన్ కూడా మంచి కంపోజిషన్ అందిస్తున్నారట. ఈ సినిమా కోసం రాం లిరిక్ రైటర్ గా కూడా మారినట్టు తెలుస్తుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత మహేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈమధ్య వరుస ఫ్లాపులు ఫేస్ చేస్తున్న రామ్ రాబోతున్న సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమాలో రామ్, భాగ్య శ్రీ జోడీ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. అందాల భామ భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమా లో మరోసారి తన అందంతో అదరగొట్టేస్తుందని అంటున్నారు. మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ సినిమా సక్సెస్ కాకపోయినా వరుస క్రేజీ ఛాన్స్ లు అందుకుంటుంది.
రాం తో భాగ్య శ్రీ జోడీ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉంటుందని అంటున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ ద్వయం వివేక్, మెర్విన్ కూడా ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందిస్తున్నారట. ప్రేమకథలకు మంచి సంగీతం అందించే అవకాశం ఉంటుంది. అందుకే రామ్ 22 సినిమాను మ్యూజిక్ తోనే సూపర్ హిట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రాం 22వ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ ఉస్తాద్ రామ్ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది.
డబుల్ ఇస్మార్ట్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని రామ్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. ఐతే ఈ సినిమాలో రామ్ లుక్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ అనీల్ పాత్రలో కనిపించనున్నారు.