శ్రుతిహాస‌న్ జీవిత‌క‌థ స్ఫూర్తితో సినిమా?

శ్రుతి హాసన్ న‌టించిన తొలి అంతర్జాతీయ చిత్రం `ది ఐ`. ఈ చిత్రానికి డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించారు.;

Update: 2025-03-06 07:00 GMT

శ్రుతి హాసన్ న‌టించిన తొలి అంతర్జాతీయ చిత్రం `ది ఐ`. ఈ చిత్రానికి డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించారు. ఫింగర్ ప్రింట్ కంటెంట్ నిర్మించింది. ఇటీవల ఫిఫ్త్ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాని ప్ర‌ద‌ర్శించారు. హర్రర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ సినిమాలను నిర్మించ‌డం ఈ బ్యాన‌ర్ ప్ర‌త్యేక‌త.

త‌న ప్రాజెక్ట్ ది ఐ గురించి శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్ చదివిన క్షణంలోనే ఈ చిత్రం త‌న‌ కోసమేన‌ని భావించిన‌ట్టు తెలిపారు. ప్రేమ‌, జీవితం, చీకటి .. స్వీయ‌ ఆవిష్క‌ర‌ణ‌ ఇవ‌న్నీ నా సినిమాలో ఉన్నాయి. ఈ క‌థ న‌న్ను ఆక‌ర్షించ‌డానికి కార‌ణాలు ఇవే. నా వ్య‌క్తిగ‌త జీవితంతోను ఇది క‌నెక్ట్ అయి ఉంద‌ని శ్రుతి హాస‌న్ అన్నారు.

`ది ఐ` తెర‌నిండుగా భావోద్వేగాలు ప‌లికించేందుకు ఆస్కారం ఉన్న సినిమా. అద్భుతమైన ప్రతిభావంతులైన పూర్తి మహిళా క్రియేటివ్ టీమ్‌తో పనిచేయడం ప్రాజెక్టుకు ప్రత్యేకత‌ను ఆపాదించింది. ఈ అవకాశాన్ని నా దారిలోకి తీసుకురావడానికి విశ్వాన్ని మ‌దించాను.. అని శ్రుతి తెలిపింది. గ్రీస్ నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది.

డయానా (హాసన్ పోషించిన) భావోద్వేగ ప్రయాణాన్ని తెర‌పై అందంగా మ‌లిచారు. తన దివంగత భర్త ఫెలిక్స్ చితాభస్మాన్ని మారుమూల ద్వీపంలో విసిరేసాక‌.. క‌థ‌లో ట్విస్టులేమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ఆ ఘ‌ట‌న‌ త‌ర్వాత ఒక‌ రహస్య ఈవిల్ ఐ కంట్లో డ‌యానా చిక్కుకుంటుంది. దుఃఖం, విధి, అతీంద్రియ శ‌క్తుల ప్ర‌యోగాల‌తో కలవరపెట్టే కథను తెర‌పై చూపారు.

ఈ చిత్రానికి ప‌లు అవార్డులు అందుకున్న ప్ర‌ముఖ‌ రచయిత్రి ఎమిలీ స్క్రిప్ట్ రాశారు. మార్క్ రౌలీ (లాస్ట్ కింగ్‌డమ్, రోగ్ హీరోస్) , బ్రిటిష్ దిగ్గజాలు అన్నా సావ్వా - లిండా మార్లో కూడా కీలక పాత్రలు పోషించారు. యుకె ట్రైల్‌బ్లేజర్ మెలానీ డిక్స్ నిర్మించారు.

Tags:    

Similar News