ఆ స్టార్ హీరో మళ్లీ జనాల్లోకి వెళ్లిపోతాడా?
తలపతి విజయ్ 69వ చిత్రం `జన నాయగన్` హెచ్. వినోధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలి సిందే.;
తలపతి విజయ్ 69వ చిత్రం `జన నాయగన్` హెచ్. వినోధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలి సిందే. విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసాడు. సమాజ సేవకు రాజకీయంగా తానెలా సిద్దం అవుతున్నాడు? అన్నది సినిమాలో హైలైట్ అయ్యే అంశంగా వినిపిస్తుంది. విజయ్ చివరి చిత్రం ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.
తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ పోర్షన్ కి సంబం ధించిన షూట్ మార్చి ముగింపు లేదా? ఏప్రిల్ మొదటి వారంలో పూర్తవుతుందని సమాచారం. అనంతరం విజయ్ రాజకీయ ప్రచారం బిజీ అవుతాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ కూడా ముందుగానే సన్నధం అవుతున్నట్లు తెలుస్తోంది.
విజయ్ కొంత కాలంగా సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. విజయ్ గత సినిమా `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` తర్వాత రాజకీయ సభలు, ప్రజల్లో తిరగడం చేసారు. ఈ క్రమంలో అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. దీంతో విజయ్ పై కొంత మంది కోలీవుడ్ హీరోలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. కానీ వాళ్లకు కౌంటర్ మాత్రం విజయ్ ఇంతవరకూ ఇవ్వలేదు.
ఈనేపథ్యంలో తాజాగా మళ్లీ జనాల్లోకి వెళ్లే కార్యక్రమం పెడుతున్న నేపథ్యంలో రాజకీయంగా కౌంటర్ ఎటాక్ కి దిగే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా జననాయగన్ స్పెషల్ టీజర్‌ను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ రకంగా సినిమా అనే మాధ్యమంతోనూ బలంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.