RC16 బర్త్ డే సర్ ప్రైజ్: మేకపిల్లతో జాన్వీ పాప
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ RC16 పై భారీ అంచనాలున్నాయి.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ RC16 పై భారీ అంచనాలున్నాయి. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు, చరణ్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశాడని టాక్. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్త అవతారం లో కనిపించనున్నాడు. అలాగే, ఈ సినిమా చరణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కావడంతో, ఫ్యాన్స్ కాస్త ఊహకందని అంచనాలు పెంచుకున్నారు.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ క్యాస్ట్ కూడా భారీగా ఉండనుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీకి రత్నవేలు పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ రామ్ చరణ్ పుట్టినరోజు, మార్చి 27న ఉంటుందని టాక్.
ఇక ఇవాళ బర్త్‌డే సందర్భంగా జాన్వీకి RC16 టీం ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. సినిమా షూటింగ్ స్పాట్ లో కాకుండా, చేతిలో మేక పిల్లను పట్టుకొని ఉన్న స్టన్నింగ్ లుక్‌లో జాన్వీ ఉన్న ఫోటోని విడుదల చేశారు. ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్, ట్రెడిషనల్ లుక్ చూసిన అభిమానులు ఫిదా అయ్యారు. షూటింగ్ కి సంబంధం లేని ఈ లుక్ ని చూస్తే, జాన్వీ RC16 లో చాలా అందంగా అల్లరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఎన్టీఆర్ దేవర లో నటించి బిగ్ హిట్ అందుకున్న జాన్వీ, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలోనూ అదే రేంజ్ లో మరో కమర్షియల్ హిట్ కొట్టాలని చూస్తోంది. దేవర లో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోవడంతో, ఈసారి బుచ్చిబాబు సినిమా ద్వారా తనకు సరైన రోల్ దొరకాలని ఆశిస్తోంది. మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య మంచి క్రేజ్ ఉన్న ఈ ప్రాజెక్ట్, జాన్వీ కెరీర్ కు బిగ్ హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి.
అందులోనూ RC16 లో ఆమెది కథకు చాలా కీలకమైన పాత్ర అని టాక్. బుచ్చిబాబు గతంలో ‘ఉప్పెన’ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి ఎంతటి ప్రాధాన్యం ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఆ స్పెషల్ టచ్ RC16 లోనూ కనిపిస్తే, జాన్వీ ఈ సినిమా ద్వారా తన నటన పరంగా కూడా కొత్త హైట్ ని అందుకోవచ్చు. అలాగే ‘దేవర’ లో వచ్చిన కామెంట్స్‌ని దృష్టిలో ఉంచుకొని, ఈ సినిమాలో ఆమె నటిగా మరింత మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఇక జాన్వీ RC16 తో పాటు బాలీవుడ్ లో రెండు ప్రాజెక్టులు చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ తో దేవర 2 కూడా లైన్ అప్ లో ఉందని సమాచారం. కానీ ఆ సినిమాకి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఆఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అయితే RC16 కంటే ముందు ఆమె బాలీవుడ్ లో కూడా బిజీగా ఉంది. మరి మెగా హీరోతో ఈ బాలీవుడ్ బ్యూటీ కెరీర్ ఎంతటి మేజర్ బ్రేక్ అందుకుంటుందో చూడాలి.