ఇదంతా ఎవ‌రి గురించి..?

ఓవైపు బ్రేక‌ప్ పుకార్లు షికార్ చేస్తున్నాయి. మ‌రోవైపు జంట సైలెన్స్ మెయింటెయిన్ చేస్తోంది.;

Update: 2025-03-06 04:20 GMT

ఓవైపు బ్రేక‌ప్ పుకార్లు షికార్ చేస్తున్నాయి. మ‌రోవైపు జంట సైలెన్స్ మెయింటెయిన్ చేస్తోంది. సౌలెంట్ గా ఎవ‌రి ప‌నులు వారు చేసుకుంటున్నారు. షూటింగుల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఇన్ స్టా నుంచి ఫోటోల‌ను మాత్రం డిలీట్ చేసారు. దీని అర్థం ఈ జంట విడిపోయారు..! లేదు!! అభిమానుల్లో ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. ఇదంతా ఎవ‌రి గురించి..? త‌మ‌న్నా భాటియా- విజ‌య్ వ‌ర్మ జంట గురించే..

ల‌స్ట్ స్టోరీస్ 2లో ఘాటైన రొమాన్స్ తో అల‌రించిన త‌మ‌న్నా- విజ‌య్ వ‌ర్మ షూటింగ్ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ జంట డేటింగ్ గురించి మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. జంట‌గా షికార్లు, ఔటింగులు వ‌గైరా వ‌గైరా వార్త‌లు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి. ఈ జంట ఇక పెళ్లితో ఒక‌ట‌వుతార‌నే భావించారు. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని బ్రేక‌ప్ హృద‌యాల‌ను గాయ‌ప‌రిచింది.

త‌మ‌న్నా- విజ‌య్ వ‌ర్మ ఇక క‌లిసి లేరు. ఆ ఇద్ద‌రూ విడివిడిగా ఉన్నారు. ఎవ‌రి ప‌నిలో వారు బిజీ అయిపోయారు. పూర్తిగా కెరీర్ పైనే దృష్టి సారిస్తార‌ని, ఎప్ప‌టిలానే స్నేహితులుగా కొన‌సాగుతార‌ని కూడా ప్ర‌చారం సాగింది. అయితే ఇన్ స్టా నుంచి జంట ఫోటోలు తొల‌గించ‌గానే, ఈ బ్రేక‌ప్ ని ఖాయం చేసేయ‌డమేనా? అధికారికంగా వారి నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డాలి క‌దా! అని కొంద‌రు నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు. త‌మ‌న్నా కానీ, విజ‌య్ కానీ సైలెన్స్ ని వ‌దిలి అధికారికంగా అస‌లేం జ‌రిగిందో చెబుతారేమో చూడాలి.

Tags:    

Similar News