అట్లీకి బ‌న్నీ కండీష‌న్!

అట్లీ సూచ‌న మేర‌కే బ‌న్నీ విదేశాల్లో నెల రోజుల పాటు స్పెష‌ల్ ట్రైనింగ్ కూడా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.;

Update: 2025-03-06 00:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్ దాదాపు ఖాయ‌మైన‌ట్లే క‌నిపిస్తుంది. ముందుగా అట్లీ ప్రాజెక్ట్ మొద‌ల‌వుతుందా? త్రివిక్ర‌మ్ తో ముందుకెళ్తాడా? అన్న సందిగ్గ‌త కూడా వీడుతుంది. ముందుగా బ‌న్నీ అట్లీ చిత్రాన్నే ప‌ట్టాలెక్కిస్తార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి వినిపిస్తుంది. అట్లీ సూచ‌న మేర‌కే బ‌న్నీ విదేశాల్లో నెల రోజుల పాటు స్పెష‌ల్ ట్రైనింగ్ కూడా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

'జ‌వాన్' రిలీజ్ అయిన ద‌గ్గ‌ర నుంచి అట్లీ బ‌న్నీ ప్రాజెక్ట్ మీద‌నే ప‌నిచేస్తున్నాడ‌ని...మ‌ధ్య‌లో వ‌చ్చిన క‌థనాలన్ని అవాస్త‌వ‌మ‌ని బ‌న్నీ స‌న్నిహితుల నుంచి వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించ‌డం పై కూడా బ‌ల‌మైన స‌మాచారం ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ విషయం కూడా లీకైంది. అట్లీకి బ‌న్నీ ఓ కండిష‌న్ పెట్టాడుట‌. ఎట్టి ప‌రిస్థితుల్లో ఏడాదిలోగా సినిమా పూర్తి చేయాల‌ని కండీష‌న్ పెట్టాడుట‌.

అందుకు అట్లీ కూడా ఓకె చెప్పిన‌ట్లు స‌మాచారం. పాన్ ఇండియా చిత్ర‌మ‌ని సంవ‌త్స‌రాల పాటు సాగ‌దీస్తే వీలు ప‌డ‌ద‌ని... వేగంగా సెట్స్ కి వెళ్లి అంతే వేగంగా ముగించుకుని రావాల‌న్నది బ‌న్నీ ప్లాన్. ఎందుకంటే బన్నీ కోస‌మే త్రివిక్ర‌మ్ ఎదురు చూస్తున్నాడు. ఈయ‌న కూడా చాలా కాలంగా బ‌న్నీకోసం స్టోరీ రాసి పెట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. మూడు నాలుగు విజ‌యాలు అందించిన గురూజీని హోల్డ్ లో పెట్ట‌డం ఇష్టం లేక‌పోయినా? అట్లీ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ కార‌ణంగా త‌ప్ప‌లేద‌నే మాట వినిపిస్తుంది.

అంటే అట్లీ ప్రాజెక్ట్ వ‌చ్చే ఏడాది మార్చి లోపు ముగించాలి. షూట్ తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా ఏక కాలంలో జ‌ర‌గాలి. అప్పుడే చిత్రాన్ని 2026 లో రిలీజ్ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఇక త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ అయితే ఏకంగా ఏడాదిన్న‌ర పాటు ఉంటుంద‌ని ఇప్ప‌టికే లీకులందుతున్నాయి. ఈ కార‌ణంగానే గూరూజీ ని వెయిటింగ్ లో పెట్టిన‌ట్లు పిలిం స‌ర్కిల్స్ లో తాజాగా వినిపిస్తోన్న మాట‌.

Tags:    

Similar News