బడ్జెట్ రేంజ్ పెంచిన హీరో కం డైరెక్టర్!
2011లో 'కాంచన' 7 కోట్లతో నిర్మించాడు. అప్పట్లో ఈసినిమా మంచి లాభాలు తెచ్చి పెట్టింది. అటుపై 'కాంచన2' తెరకెక్కించాడు.;
హారర్ కామెడీ చిత్రాల్లో రాఘవ లారెన్స్ బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. 'ముని'తో మొదలైన ప్రస్థానం ఇంకా అలాగే కొనసాగుతుంది. స్వీయా దర్శకత్వంలో తెరకెక్కిస్తూ 'కాంచన' సిరీస్ నుంచి వరుస విజయాలు అందుకుంటున్నాడు. అలాగే సినిమా సీక్వెల్స్ బడ్జెట్ అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్నాడు. 2011లో 'కాంచన' 7 కోట్లతో నిర్మించాడు. అప్పట్లో ఈసినిమా మంచి లాభాలు తెచ్చి పెట్టింది. అటుపై 'కాంచన2' తెరకెక్కించాడు.
తాప్సీని ఫీమేల్ లీడ్ గా తీసుకుని 17 కోట్లతో నిర్మించగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 'కాంచన' సిరీస్ లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. అటుపై 'కాంచన3' కూడా మంచి ఫలితాలు సాధిం చింది. కానీ భారీ అంచనాలైతే థర్డ్ పార్ట్ అందుకోలేదు. కంటెంట్ కాస్త వీక్ గా ఉందనే విమర్శలు వ్యక్తమ య్యాయి. అలాగే రొటీన్ కంటెంట్ అనే వాదనా తెరపైకి వచ్చింది.
అలా 'కాంచన 3'పై కొంత ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో 'కాంచన 4'ని మాత్రం మరింత ప్రతిష్టా త్మకంగా ప్లాన్ చేస్తున్నాడు. సమయం కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత నాల్గవ భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు . 'కాంచన 4' కోసం ఏకంగా 70 కోట్లు బడ్జెట్ కేటాయించారుట. భారీ కాన్వాస్ పై ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడుట. కంటెంట్ ను చాలా కొత్తగా సిద్దం చేసాడుట. టెక్నికల్ గానూ సినిమాను హైలైట్ చేయాలన్నది ప్లాన్ అట. గతంలో వచ్చిన మూడు భాగాలకు మించి ఉండేలా సన్నాహాలు చేస్తున్నాడుట. ఇందులో ఇప్పటికే 'బధిర' యువతిగా పూజాహెగ్డే ఎంపికైంది.