రాయలసీమ రౌడీ జనార్దన్ కథ ఏంటో..?
అంతేకాదు లేటెస్ట్ గా ఈ సినిమా టైటిల్ ని రౌడీ జనార్ధన్ గా ఫిక్స్ చేశామని దిల్ రాజు లీక్ చేశాడు.;
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సమ్మర్ రేసులో దిగబోతుండగా ఆ మూవీ తర్వాత రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. రవికిరణ్ కోలా ఈ సినిమా స్క్రిప్ట్ దశ నుంచే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఐతే ఈ సినిమా కథ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు లేటెస్ట్ గా ఈ సినిమా టైటిల్ ని రౌడీ జనార్ధన్ గా ఫిక్స్ చేశామని దిల్ రాజు లీక్ చేశాడు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ రవి కిరణ్ కోలా సినిమా టైటిల్ లీక్ చేశాడు దిల్ రాజు. ఇదివరకు టైటిల్ చెప్పామన్న ఆలోచనలో రౌడీ జనార్ధన్ టైటిల్ రివీల్ చేశాడు. ఐతే ఇలా టైటిల్స్ లీక్ చేయడం చిరంజీవి నుంచి అలవరచుకున్నారేమో కానీ టైటిల్ చెప్పేశాక ఏంటి టైటిల్ చెప్పేశానా అని అనుకోవడం దిల్ రాజు వంతు అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ టైటిల్ చూసి రౌడీ ఫ్యాన్స్ నిజంగానే షాక్ అవుతున్నారు. రౌడీ జనార్ధన్ విజయ్ కి పర్ఫెక్ట్ టైటిల్ అని అంటున్నారు. అంతేకాదు రాయలసీమ లో జరిగే కథ కాబట్టి తప్పకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫిక్స్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఒక మంచి మాసివ్ హిట్ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఐతే కింగ్ డమ్ టీజర్ చూసే ఇది పక్కా ష్యూర్ షాట్ హిట్ అని డిసైడ్ అయిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రవి కిరణ్ సినిమా టైటిల్ రౌడీ జనార్ధన్ అనే సరికి మరింత ఎగ్జైట్ అవుతున్నారు.
విజయ్ దేవరకొండని అందరు ముద్దుగా రౌడీ స్టార్, రౌడీ హీరో అనేస్తుంటారు. అతను తన ఫ్యాన్స్ ని రౌడీస్ అంటుంటాడు. సో అతను కూడా రౌడీ హీరో అనేలా భావన కలిగించాడు. ఐతే ఈమధ్య తన పేరు మీద ఎలాంటి ట్యాగ్ లైన్ లు ఉండవు ది దేవరకొండ తప్ప అంటూ చెప్పుకొచ్చిన విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ టైటిల్ ని ఓకే చేశాడు అంటే రౌడీ ఫ్యాన్స్ ని అలరించేందుకే అని అనుకుంటున్నారు.
ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. దిల్ రాజు ఈ మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. స్క్రిప్ట్ దశలోనే సినిమా హిట్ అనేలా ఉందని టాక్. మే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.