బలగం బ్యూటీ వెయిటింగ్ ఫర్ ఏ ఛాన్స్..!

బలగం తో పాపులారిటీ బాగా వచ్చినా అవి ఛాన్స్ ల రూపంలో మాత్రం మారాలేదు. బలగం తర్వాత అమ్మడు శ్రీ సిం హాతో ఉస్తాద్ అనే సినిమా చేసింది.;

Update: 2025-03-06 02:30 GMT

చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి హీరోయిన్ గా మారిన భామల్లో తెలుగు అమ్మాయి కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఆడియన్స్ కు దగ్గరైన ఈ అమ్మడు మసూద సినిమాతో హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. ఆ తర్వాత బలగం సినిమాతో ఆకట్టుకుంది. ప్రియదర్శికి జతగా బలగం సినిమాలో కావ్య నటనకు ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. బలగం తో పాపులారిటీ బాగా వచ్చినా అవి ఛాన్స్ ల రూపంలో మాత్రం మారాలేదు. బలగం తర్వాత అమ్మడు శ్రీ సిం హాతో ఉస్తాద్ అనే సినిమా చేసింది.

ఆ సినిమా కూడా వర్క్ అవుట్ కాకపోయే సరికి కావ్యని ఎవరు పట్టించుకోవట్లేదు. ఐతే కావ్య మాత్రం సినిమా ఆఫర్లు లేకపోయినా ఆడియన్స్ ను తన ఫోటో షూట్స్ తో బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. తనదైన శైలిలో రకరకాల ఫోటో షూట్స్ తో అలరిస్తుంది కావ్య కళ్యాణ్ రాం. కెరీర్ బిజీ చేసుకునే ప్లానింగ్ లో భాగంగానే అమ్మడు ఫోటో షూట్స్ తో ఎట్రాక్ట్ చేస్తుంది.

ముఖ్యంగా తన క్యూట్ లుక్స్ తో కావ్య ఫాలోవర్స్ హృదయాలను మెలిపెట్టేలా చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ గా కూడా అదే ఫాం కొనసాగించాలని చూస్తుంది. ఐతే బలగం హిట్ తో కచ్చితంగా కావ్య కెరీర్ ఊపందుకుంటుందని అనుకోగా ఎందుకో అలా జరగలేదు. ఐతే కావ్య కూడా హడావిడిగా సినిమాలు చేసే ఉద్దేశం లేనట్టు ఉంది.

అందుకే కెరీర్ గురించి పెద్దగా దిగులు పడకుండా వచ్చిన ఛాన్స్ లనే చేస్తూ వస్తుంది. ఐతే కొందరు తెలుగు అమ్మాయి కాబట్టే కావ్యకి అవకాశాలు ఇవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నా వాటిని అసలేమాత్రం లెక్క చేయకుండా తన కోసం రాసి పెట్టుకున్న పాత్రలు వస్తాయని ఎదురుచూస్తుంది అమ్మడు. ఈమధ్య సినిమాల్లో కాస్టింగ్ విషయంలో డైరెక్టర్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కావ్య లాంటి భామ కావాలి ఆమె మాత్రమే చేస్తుంది అని ఫిక్స్ అయితే వెంటనే పిక్ చేసుకుంటున్నారు. ఐతే కావ్య కూడా అలాంటి ఛాన్స్ ల కోసమే ఎదురుచూస్తున్నట్టుగా ఉందని తెలుస్తుంది.

కావ్య సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తోనే ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదిస్తుంది. ఇక వాటికి తోడు మంచి సినిమాలు కూడా పడితే తిరుగు ఉండదని చెప్పొచ్చు.

Tags:    

Similar News