కాలేజ్ డేస్ లోకి వెళ్ళిపోయిన రష్మిక..!

సింపుల్ స్టైల్, హాయిగా చిరునవ్వుతో రష్మిక క్యాజువల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ మరింత ఆకట్టుకుంది.;

Update: 2025-03-05 15:14 GMT

రష్మిక మందన్నా మరోసారి తన సహజమైన అందంతో అభిమానుల మనసులు దోచేసింది. మేకప్ లేకుండా, సంప్రదాయ చీరకట్టులో కనిపించిన ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోల్డెన్ బ్రౌన్ చీర, నీలం రంగు బ్లౌజ్‌లో, సొగసైన వయ్యారంతో ఈ నేషనల్ క్రష్ స్టన్నింగ్ లుక్ ఇచ్చేసింది. సింపుల్ స్టైల్, హాయిగా చిరునవ్వుతో రష్మిక క్యాజువల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ మరింత ఆకట్టుకుంది.


ఈ ఫోటోలను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, చివరి నిమిషంలో మేకప్, హెయిర్‌స్టైల్ అన్నీ తానే చేసుకోవాల్సి రావడంతో ఇలా అయ్యిందని సరదాగా చెప్పింది. తన ఫ్రెండ్ ఫోటోలు తీయడంతో, ఇది పూర్తిగా కాలేజీ రోజులను గుర్తుచేసేలా ఉందని చెప్పింది. సాధారణంగా ఫ్యాన్సీ అవుట్‌ఫిట్స్, ట్రెండీ లుక్స్‌తో కనిపించే రష్మిక.. ఈసారి సంప్రదాయ హంగులతో మెరిసిపోయింది.


ఫోటోలలో రష్మిక చూపించే మెలోడి కంటే, ఆమె హావభావాలే ప్రధాన ఆకర్షణగా మారాయి. ఎక్కడ చూసినా ముద్దుగా, క్యూట్‌గా కనిపించే ఈ భామ.. నలుపు రంగు గాజులతో, లేత జుంకాలతో పర్ఫెక్ట్ ట్రెడిషనల్ లుక్ ఇచ్చింది. కేవలం డ్రెస్ మాత్రమే కాదు, తన ఎక్స్‌ప్రెషన్స్‌ ద్వారా కూడా ఆమె అందాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లింది. చిరునవ్వుతో రష్మిక ఇచ్చిన ఫోటోలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి.


సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ఫోటోలు భారీ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇదే నీ బెస్ట్ లుక్, రష్మికా.. నువ్వు ఇలానే ఎప్పుడూ ఉండాలి, సింప్లిసిటీకి నువ్వే బెస్ట్.. అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. రష్మిక అందానికి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఇక అమ్మడు ఇటీవల యానిమల్ - పుష్ప 2 - ఛావా సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ను సొంతం చేసుకుంది.

Tags:    

Similar News