మెగాస్టార్ విజ్వంభర.. మళ్ళీ సమస్యేంటి?
అయితే, ఈ సినిమా విడుదలపై అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో సినిమా అవుట్ పుట్ పై కూడా రకరకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.;
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా మొదట్లో అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు వశిష్ట బింబిసార సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఎనౌన్స్ చేసినప్పుడే సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. అయితే, ఈ సినిమా విడుదలపై అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో సినిమా అవుట్ పుట్ పై కూడా రకరకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.
అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి గేమ్ ఛేంజర్ ఉండడం వల్ల వెనక్కి తగ్గారు. అంతే కాకుండా గ్రాఫిక్స్ విషయంలో అంతగా సంతృప్తి చెందకపోవడం కూడా మరొక రీజన్ అని టాక్ వచ్చింది. దీంతో మే నెలకి వాయిదా వేసారు. ఇప్పుడు మళ్ళీ కొత్త తేదీపై క్లారిటీ లేకపోవడంతో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఈ ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణం విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ పనులు అన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. టాలీవుడ్ లో ఇప్పటివరకు అనుకున్నట్టు గ్రాఫిక్స్ పనులు ఫినిష్ కాలేదట, దీంతో మరీంత సమయం పట్టేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్, అత్యుత్తమ క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా ఉండాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకే, హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ రూపొందించేందుకు ప్రముఖ స్టూడియోల సహాయాన్ని తీసుకుంటున్నారు.
అవతార్ చిత్రానికి పని చేసిన టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు కూడా విశ్వంభర కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నాగ్ అశ్విన్ కూడా ఇన్ ఫుట్స్ ఇచ్చినట్లు ఆమధ్య రకరకాల కథనాలు వచ్చాయి. దీంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పని మరింత సమయం తీసుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో కనిపించనుండగా, చిత్రంలోని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మిక్స్ కావడం మరో ప్రధాన ఆకర్షణ.
ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్, టీజర్ లకు మంచి స్పందన వచ్చినా, ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉండబోతుందనేదానిపై అందరికీ భారీ ఆసక్తి నెలకొంది. ఈ స్థాయిలో భారీ గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్న సినిమా కావడంతో, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు క్వాలిటీని మిస్సవ్వకుండా తీసుకురావాలని టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇకపోతే, సినిమా ఆలస్యమవుతున్నా, నటీనటులు మాత్రం ప్రాజెక్ట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు.
సినిమాలో త్రిష, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్ వంటి స్టార్స్ నటిస్తుండగా, వారికి సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసం మాత్రమే ఆలస్యం జరుగుతోందని టీమ్ చెబుతోంది. అయితే, మే నెలలో కూడా సినిమా రావడం కష్టమేనన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాల విడుదల వాయిదాలు సాధారణంగా మారిపోయాయి. ఆదిపురుష, సలార్, హనుమాన్ వంటి సినిమాలు క్వాలిటీ మెరుగుపరిచే క్రమంలో ఆలస్యమయ్యాయి. అలాగే విశ్వంభర కూడా అదే బాటలో వెళ్తోందా లేదా థియేట్రికల్ రిలీజ్ కోసం మరో షాకింగ్ అప్డేట్ వస్తుందా అనే ప్రశ్న మెగా అభిమానుల మదిలో ఉంది.