'వార్ 2' క్లిప్ లీక్... అందులో ఏముంది?
సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన ఆ క్లిప్‌ను మేకర్స్ డిలీట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
హృతిక్ రోషన్ హీరోగా ఎన్టీఆర్ కీలక పాత్రలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందుతున్న 'వార్ 2' సినిమాను ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందుకు తగ్గట్లుగా షూటింగ్ స్పీడ్‌గా చేస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇదే సమయంలో సినిమాలోని కొన్ని సన్నివేశాలకు వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. సినిమా యాక్షన్ సన్నివేశాలకు వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతూ ఉండగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య జరిగే ఫైట్‌కి సంబంధించి చిన్న క్లిప్ లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన ఆ క్లిప్‌ను మేకర్స్ డిలీట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ఇలాంటి వీడియోలను ఎక్కువ షేర్ కాకుండా వెంటనే నిరోధించగలుగుతోంది. దాంతో వార్ 2 యూనిట్ సభ్యులు ఎక్స్ టీంతో సంప్రదింపులు జరిపి వెంటనే చర్యలు తీసుకున్నారు. అయితే ఇతర ప్లాట్ ఫామ్‌లపై మాత్రం ఇంకా వార్ 2 లీక్ సీన్ షేర్ అవుతుందని తెలుస్తోంది. అక్కడ కూడా అతి త్వరలోనే ఆ క్లిప్‌ను డిలీట్ చేసే విషయమై తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే వార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి సమయంలో లీక్ కావడం అనేది ఏమాత్రం మంచిది కాదు. అందుకే మేకర్స్ ఈ విషయంపై చాలా స్పీడ్‌గా స్పందించారు.
మరో వైపు లీక్ అయిన క్లిప్‌లో ఏం ఉంది, ఎన్టీఆర్ ఎలా ఉన్నారు అంటూ ఫ్యాన్స్‌లో చర్చ జరుగుతోంది. చూసిన వారు సోషల్ మీడియాలో ఇండైరెక్ట్‌గా కామెంట్స్ చేస్తూ ఉంటే, చూడని వారు వారి పోస్ట్‌లను చూసి ఊహించుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ను వార్ 2 లో చాలా స్పెషల్‌గా చూడబోతున్నారు అంటూ మరోసారి లీక్ అయిన క్లిప్ కూడా చెప్పకనే చెబుతోంది అంటూ అభిమానులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో అయాన్ ముఖర్జీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
బ్రహ్మాస్త్ర వంటి మంచి విజయాన్ని, భారీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో అంచనాలు నార్త్ ఇండియాలో భారీగా ఉన్నాయి. వార్ 2 సినిమా విడుదల సమయంలో సౌత్‌లోనూ అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల మధ్య ఫైట్ సీన్స్ ఉంటాయా లేదంటే ఇద్దరు మంచి స్నేహితులా అనే విషయాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయినా వార్ 2 సినిమాను చూడ్డానికి ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వార్ 2 సినిమా విడుదలకు ముందే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అతి త్వరలోనే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ ప్రారంభం అయ్యి 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.