నటవారసుల ఆరంగేట్రంపై KJO పెద్ద ప్రకటన
ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తర్వాత లవ్ యాపా అనే చిత్రంతో ఖుషి పెద్ద తెరకు ఆరంగేట్రం చేస్తోంది.
అతిలోక సుందరి శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్, సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్.. ఘనమైన సినీఎంట్రీ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తర్వాత లవ్ యాపా అనే చిత్రంతో ఖుషి పెద్ద తెరకు ఆరంగేట్రం చేస్తోంది. అదే సమయంలో ఇబ్రహీం అలీఖాన్ ని కరణ్ జోహార్ లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నదానియన్' చిత్రంలో ఖుషీ కపూర్ సరసన ఇబ్రహీం అలీ ఖాన్ ని లాంచ్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా టైటిల్ తో పాటు తొలి పోస్టర్‌ను శనివారం ఉదయం ఆవిష్కరించారు. ఇది నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' కోసం కరణ్ జోహార్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన దర్శకురాలు షానా గౌతమ్ తొలి పరిచయ చిత్రం కానుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇబ్రహీం - ఖుషీ చాలా క్యాజువల్‌గా పచ్చని మైదానంలో కూర్చుని కెమెరాలోకి చూస్తూ కనిపించారు. కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ ధర్మాటిక్ ఎంటర్‌టైన్మెంట్ లో ఇబ్రహీంను పరిచయం చేస్తున్నానని ఇంతకుముందే ప్రకటించారు. ప్రస్తుతం పోస్టర్ విడుదలైంది. శుక్రవారం సాయంత్రం తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక మిస్టరీ మ్యాన్ (ఇప్పుడు ఇబ్రహీం అని వెల్లడైంది) రహస్య ఫోటోతో ఖుషీ టీజ్ చేసింది. అలాగే నెట్ ఫ్లిక్స్ నుండి వచ్చిన ఒక పత్రికా ప్రకటన 'నాదానియన్'ను ప్రేమకథా చిత్రమని తెలిపింది.
దక్షిణ ఢిల్లీకి చెందిన ధైర్యవంతురాలైన మరియు ఉత్సాహవంతురాలైన అమ్మాయి పియా - నోయిడాకు చెందిన మధ్యతరగతి అబ్బాయి అర్జున్ మధ్య ప్రేమకథను తెరపై చూపిస్తున్నారు. పూర్తిగా రెండు భిన్నమైన ప్రపంచాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు వారి అల్లరి, తొలి ప్రేమ తీపి గందరగోళంలో ప్రయాణం ఎలా సాగిందన్నదే సినిమా.
నాదానియన్‌లో మహిమా చౌదరి, సునీల్ శెట్టి, దియా మీర్జా , జుగల్ హన్స్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మిస్తున్నారు.