అంబానీల ఇంట పెళ్లి సందడి ఒక రేంజ్లో సాగుతోంది. కొడుకు.. కుమార్తె పెళ్లిళ్లను బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న అంబానీ ఇంట ఇప్పుడంతా పెళ్లి వేడుకే కనిపిస్తోంది. దేశంలో మరెవరూ చేయని రీతిలో దాదాపు రూ.వెయ్యి కోట్లను ఈ రెండు పెళ్లిళ్ల కోసం వెచ్చిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇంత భారీగా జరుగుతున్న పెళ్లి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు అన్ని ఇన్ని కావు.
తాజాగా అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ.. ప్రముఖ వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల వివాహ వేడుకలు తాజాగా షురూ అయ్యాయి. పెళ్లికి మరో రెండు రోజుల ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెళ్లి వేడుకల్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో పెళ్లికుమారుడు.. పెళ్లి కుమార్తె ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోటో గ్రాఫర్లు వీరిద్దరిని ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల ఫోకస్ అంతా అంబానీ కాబోయే కోడలి మీదనే ఉందట.
ఇలాంటి వేళ.. అకాశ్ అంబానీ కలుగజేసుకొని.. శ్లోక చాలా అలిసిపోయింది. తను నవ్వుతున్నప్పుడు మాత్రమే ఫోటోలు తీయండి.. అని ఒకసారి.. శ్లోకకు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది.. మా శరీరాలు వేర్వేరు కానీ.. మా ఆత్మలు ఒక్కటే అంటూ చెప్పిన మాటకు అక్కడి వారంతా పెద్దగా నవ్వేసినట్లు చెబుతున్నారు. ఆమెకు బదులుగా నన్ను ఫోటో తీయండి.. ఎందుకంటే ఇది పుట్టినరోజు వేడుక కాదు.. మా ఇద్దరికి పెళ్లి జరగబోతోంది.. ఈ ఫోటోలు మాకెంతో తీపి గురుతుగా మారనున్నాయి అంటూ చెప్పిన మాటలు అక్కడి వారి చేతో.. ఓహో.. అంటూ ఒక ఓయో వేసేసుకునేలా చేశాయి. కాబోయే భర్త నోటి నుంచి ఇలాంటి కేరింగ్ మాటలు వస్తే పెళ్లి కుమార్తెకు కలిగే ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదుగా!