ఆగస్టు నుండి అఖిల్‌ రెండో సినిమా?

Update: 2016-07-13 13:02 GMT
నిజంగా టాలీవుడ్ ను బాగా ఊరిస్తున్న విషయం ఏదన్నా ఉందంటే.. మొన్నటివరకు వరుణ్‌ తేజ్‌ ''మిష్టర్‌'' మొదలవుతుందో అవ్వదా అనే విషయం.. అంతకంటే ముందు నుండి అఖిల్‌ రెండో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం. అయితే ఇప్పుడు వరుణ్‌ క్లారిటీ ఇచ్చాక.. అఖిల్ సినిమాకు కూడా క్లారిటీ వచ్చేశేలా ఉంది. పదండి చూద్దాం.

వంశీ పైడిపల్లి నుండి గోపిచంద్ మలినేని వరకు.. ఇలా అఖిల్‌ సినిమా విషయంలో అనేకమంది పేర్లు వినిపించాయి. ఇక దర్శకుడు వంశీతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయ్యింది అని తెలియగానే.. స్వయంగా అఖిల్ స్పందించాడు. ఆ సినిమా జరుగుతోంది.. స్టోరీ సెట్ అవ్వగానే ప్రకటన ఇస్తాను అంటూ ట్విట్టర్ సాక్షిగా చెప్పాడు. అలా చెప్పి కొన్ని నెలల గడుస్తున్నా కూడా ఇంకా ఏమీ ముందుకు వెళ్ళట్లేదు. ఇకపోతే ఆ మధ్యన ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక లవ్ స్టోరీని దర్శకుడు హను రాఘవపూడి అన్నపూర్ణ స్టూడియోస్ కు నెరేట్ చేయగా.. దానిని డెవలప్ చేసుకొని రమ్మన్నారట.

ఇప్పుడు ఫైనల్‌ వర్షన్ ను నాగ్ అండ్ అఖిల్ కు నెరేట్ చేయగా.. ఇద్దరూ ఫుల్లుగా ఎక్సయిట్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆగస్టు రెండో వారం నుండి పట్టాలెక్కిస్తున్నట్లు జూబ్లీ హిల్స్ టాక్‌. మొత్తానికి అఖిల్‌ రెండో సినిమా మొదలెట్టడానికి.. మొదటి సినిమా రిలీజైన తరువాత ఏకంగా సంవత్సరం పాటు ఆలోచించాల్సి వచ్చిందే.
Tags:    

Similar News