నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తండ్రి పేరు నిలబెట్టాడు. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ టాలీవుడ్ కింగ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో అక్కినేని కాంపౌండ్ నుంచి సుమంత్ - నాగచైతన్య - అఖిల్ - సుశాంత్ లు హీరోలుగా పరిచయమయ్యారు. అయితే ఇంతమంది హీరోలున్నా.. సూపర్ హిట్ సినిమాలు తీసినా ఫ్యాన్ బేస్ లో మెగా ఫ్యామిలీని అందుకోలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి.
అయితే దీనికి అక్కినేని హీరోల సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే సినిమాలు అనే ముద్ర పడిపోవడమే కారణమని అందరూ భావిస్తుంటారు. టాలీవుడ్ లో మాస్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుందనేది వాస్తవం. అక్కినేని హీరోలు మాస్ సినిమాలు చేసినా వారిని ప్రేక్షకులకు దగ్గర చేసింది మాత్రం ఫ్యామిలీ సినిమాలే. అందుకే అదే కోవలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్ బేస్ లో కాస్త వెనుకబడి ఉన్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో సైతం మెగా అభిమానులు చేసినంత హడావుడి అక్కినేని అభిమానుల్లో కనిపించదు.
ఈ నేపథ్యంలో సినిమాకి భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టేవి దాదాపు అన్నీ మాస్ సినిమాలే. అందుకే నాగార్జున తన ని ఎలాగైనా మాస్ హీరోగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కినేని అభిమానులు కూడా వారి నుంచి మంచి మాస్ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు. అందుకే అఖిల్ కి ఒక్క సాలిడ్ హిట్ పడితే ఇండస్ట్రీలో తన సత్తా చూపిస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇక నాగార్జున సైతం మాస్ మసాలా సినిమాలు చేయాలని.. ఆ తర్వాత ఓటీటీ కంటెంట్ సినిమాలు.. 'బిగ్ బాస్' లాంటి షోలు చేసుకోవచ్చని వారు కామెంట్స్ చేస్తున్నారు.