రజినీకాంత్ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తాడని ఎప్పుడూ ఎవ్వరూ అనుకోలేదు. ఈ ఆసక్తికర కాంబినేషన్ ‘రోబో’ సీక్వెల్ ‘2.0’తో సాద్యమవుతోంది. ముందు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ కోసం అనుకున్న పాత్రను ఆ తర్వాత అక్షయ్ కుమార్ కు ఇచ్చాడు శంకర్. ఆ మధ్య లీకైన అక్షయ్ లుక్ చూసి అతను పోషిస్తున్న పాత్ర విషయంలో రకరకాల రూమర్లు వచ్చాయి. ఇందులో అక్షయ్ కాకిలా కనిపిస్తాడని.. పిచ్చి పట్టిన సైంటిస్ట్ అని ప్రచారం జరిగింది. ఐతే ఈ రూమర్లపై అక్షయ్ స్వయంగా స్పందించాడు. ఈ ఊహాగానాలు ఆపాలని కోరాడు.
‘‘2.0లో నేను పిచ్చి సైంటిస్టునా.. కాకినా.. ఇది నాకు కొత్త న్యూస్. ఎవరేమైనా ఊహించుకోండి. సినిమాలో మీ ఊహలకు భిన్నంగా కనిపిస్తా. నా పాత్ర.. దానికి సంబంధించిన మేకప్ గురించి ఇప్పుడు వివరాలేవీ చెప్పను. ఒకే ఒక్క విషయం చెబుతాను. ఈ మధ్య నేనో హోటల్ కు వెళ్లాను. ‘2.0’లోని పాత్రకు సంబంధించిన మేకప్ వేసుకునే వెళ్లాను. ఎవరూ నన్ను చిత్రంగా చూడలేదు. అంటే చూడ్డానికి మరీ విచిత్రంగా ఏమీ లేనన్న మాట. ఐతే ఎవ్వరూ నన్ను గుర్తుపట్టలేదు. దాంతో హాయిగా అక్కడి ఫుడ్ ఎంజాయ్ చేశాను’’ అని అక్షయ్ చెప్పాడు. ఇప్పటికే ‘2.0’ షూటింగ్ 50 శాతం పూర్తయింది. ప్రస్తుతం తలకోనలో కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే రజినీ షూటింగుకి వస్తాడు.