ఆ విషయాలు నమ్మొద్దు.. సోహెల్‌ కు ఓటు వేయండిః అలీరెజా

Update: 2020-12-19 05:09 GMT
బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ మాజీ కంటెస్టెంట్స్‌ నుండి అనూహ్యంగా మద్దతు లభించింది. కొందరు అభిజిత్‌ వైపు ఉంటే మరి కొందరు సోహెల్‌ వైపు మరి కొందరు అరియానా ఇంకా హారిక వైపు కూడా ఉన్నారు. ఇలా ఎవరికి ఇష్టం అయిన వారి గురించి వారు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో తమ ఫేవరేట్‌ కంటెస్టెంట్‌ కోసం ప్రచారం చేయడంతో పాటు ఓటు వేసే విషయాన్ని ప్రతి రోజు గుర్తు చేస్తున్నారు. అభిజిత్‌ విజేత అంటూ భారీ ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇతర కంటెస్టెంట్స్ కు సంబంధించిన అభిమానులు ఓటింగ్‌ విషయంలో లైట్‌ తీసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో సోహెల్‌ కు మద్దతుగా అలీ రెజా ముందుకు వచ్చాడు. ఇప్పటికే నా దృష్టిలో నువ్వు విజేతవు అయ్యావు అంటూ సోహెల్‌ ను ఉద్దేశించి అలీ వ్యాఖ్యలు చేశాడు. మరో పోస్ట్‌ లో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అస్సలు నమ్మవద్దు. ఓట్లు ఎవరికి పడుతున్నాయి అనే విషయం అధికారికంగా తెలియదు. అధికారికంగా వస్తున్న ఓట్ల గురించి ఎవరికి తెలియదు. కొందరు చేస్తున్న ప్రచారంను నమ్మి సోహెల్‌ కు ఓట్లు వేయడం మర్చిపోవద్దు.

ప్రతి ఒక్కరు కూడా సోహెల్‌ కు ఓట్లు వేయండి. ఒకటికి రెండు సార్లు హాట్‌ స్టార్‌ లో మీ ఓట్లు నమోదు అయ్యాయా చూడండి. ఓట్లు చీల్చి వేయకండి. మిస్డ్‌ కాల్స్ ద్వారా కూడా మీ మద్దతు తెలపండి అంటూ సోహెల్‌ కు మద్దతుగా అలీ రెజా పోస్ట్‌ పెట్టాడు. సోహెల్‌ నెం.2 గా నిలుస్తాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలీ రెజా మాత్రం విజేత అవుతాడని నమ్మకంగా ఉన్నాడు. మరి సోహెల్‌ ఏ స్థానంలో నిలుస్తాడో చూడాలి.
Tags:    

Similar News