బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. ఇంట్లో గొడవలు - ఫన్ - రొమాన్స్ - ఏడుపులు ఇలా అన్ని రకాల ఎమోషన్స్ నడుస్తున్నాయి. శుక్రవారం ఎపిసోడ్ లో కూడా చాలానే ఫన్ - ఏడుపులు చోటు చేసుకున్నాయి. ఫన్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులు బిగ్ బాస్ అడిగే ప్రశ్నలకు సరదా సమాధానం ఇవ్వాలి. ఈ సమాధానాల్లో ఎవరు ఎక్కువ ఫన్ పంచుతారో వారు విజేతలుగా నిలుస్తారు. విజేతగా నిలిచిన వారు బిగ్ బాస్ ఇచ్చిన టీ షర్ట్ వేసుకుంటారు. వారితో ఇంటిసభ్యులు ఆ రోజంతా నవ్వుతూ మాట్లాడాలి.
ఇక టాస్క్ కు సంబంధించిన ప్రశ్నలను బిగ్ బాసే ఇచ్చారు. ఈ ప్రక్రియకు శ్రీముఖి సంచాలకులుగా వ్యహరించింది. ప్రతి ప్రశ్నకు కేవలం 5 సెకెన్లలో ఫన్నీ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అయితే అందరికంటే ఎక్కువ మహేష్ ఫన్నీ ఆన్సర్లు ఇచ్చి మెప్పించాడు. దీంతో అతన్నే విజేతగా ప్రకటించారు. ఈ కార్యక్రమం తర్వాత హౌస్ మేట్స్ కు వారి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి ఇష్టమైన ఫుడ్ - ఓ మెసేజ్ పంపించారు. ఇక వరుసగా ఒక్కొక్కరు ఇంటి నుంచి మెసేజ్ చదువుతూ - ఏం ఫుడ్ పంపారో చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
అయితే ఇలాగే అలీకి ఇంటి నుంచి మెసేజ్ వచ్చింది. అలీ భార్య ప్రేమగా అన్ని చెప్పి చివరిలో ‘ఐ ట్రస్ట్ యూ’(నేను నిన్ను నమ్ముతున్నాను) అని పెట్టింది. దీంతో అలీ కొంచెం షాక్ కు గురయ్యాడు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అలీ-శ్రీముఖిల మధ్య బాండింగ్ పెరిగిన విషయం తెలిసిందే. ఓ టాస్క్ లో వీరి మధ్య రొమాన్స్ పీక్ కు వెళ్లింది. దీంతో అలీ భార్య అలా పెట్టిందని అంతా భావించారు. ఈ టాస్క్ అయిపోయాక శ్రీముఖి మూడీగా కూర్చుని ఉండటంతో అలీ - శివజ్యోతిలు మాట్లాడటానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తనతో కొన్ని రోజులు మాట్లాడొద్దని శ్రీముఖి అలీకి చెప్పింది. అలా కాదు మీరొకసారి పర్సనల్ గా మాట్లాడుకోమని శివజ్యోతి చెప్పడంతో...అలా ఏం వద్దూ తనని కాసేపు వదిలేయమని చెప్పింది. దీంతో వాళ్ళు వదిలేసి వెళ్లారు.