కిరణ్ అబ్బవరం సర్‌ప్రైజ్.. ఆ విజేతకు భారీ బహుమతి!

20 వేల మందిలోకర్నూలుకి చెందిన రామాంజనేయులు కరెక్ట్ గా కథను గెస్ చేసి గెలిచాడు అని స్టేజ్ పైనే కిరణ్ ఎనౌన్స్ చేశారు. నిజంగా ఈ బైక్ నాకు చాలా ఇష్టం.;

Update: 2025-03-12 13:50 GMT

సినిమా ప్రమోషన్ అనగానే ట్రైలర్ లాంచ్, ఇంటర్వ్యూలు, ఈవెంట్లు.. ఇవే మామూలుగా జరిగే కార్యక్రమాలు. కానీ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా దిల్‌రుబా ప్రచారంలో విభిన్నంగా ముందుకెళ్లాడు. ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేసేందుకు ఓ ఆసక్తికరమైన కాంటెస్ట్ ప్రకటించాడు. సినిమా కథను అంచనా వేసే వ్యక్తికి నజరానా ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. సాధారణంగా చిత్రబృందం ఇలా రివార్డ్స్ ప్రకటించడమంటే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడమే కానీ, కిరణ్ అయితే ఏకంగా మూడు లక్షల రూపాయల విలువైన బైక్‌ను గిఫ్ట్‌గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ కాంటెస్ట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అభిమానులు, సినీ ప్రేక్షకులు తమదైన స్టైల్‌లో కథను ఊహించి సోషల్ మీడియాలో భాగస్వామ్యం అయ్యారు. కిరణ్ అబ్బవరం అయితే ముందుగానే హింట్ ఇచ్చినట్లుగానే తన సినిమా కథలో ఓ ప్రత్యేకత ఉందని చెప్పాడు. ఎంతో మంది అభిమానులు తమ తమ గెస్ లను పంపించినా, అందులో కచ్చితంగా కథను అంచనా వేసిన ఒక వ్యక్తిని విజేతగా ఎంపిక చేసి, బహుమతి అందజేశాడు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై అదే గ్రాండ్‌గా జరిగింది.

20 వేల మందిలోకర్నూలుకి చెందిన రామాంజనేయులు కరెక్ట్ గా కథను గెస్ చేసి గెలిచాడు అని స్టేజ్ పైనే కిరణ్ ఎనౌన్స్ చేశారు. నిజంగా ఈ బైక్ నాకు చాలా ఇష్టం. ఈ అబ్బాయికి బైక్ ఇవ్వడం నాకు సంతోషంగా ఉందని కిరణ్ వివరణ ఇచ్చారు. ఇక బైక్ గెలుచుకున్న కుర్రాడు కూడా దిల్ రుబా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాడు. తనను ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు అంటూ కిరణ్ అన్నతో కలిసి టైమ్ స్పెండ్ చేయడం హ్యాపీగా అనిపించిందని చెప్పాడు.

ఇక ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చి తన సినిమా కథను మరింత ఇంటరెస్టింగ్‌గా మార్చిన కిరణ్ అబ్బవరం ప్రస్తుత టాలీవుడ్ ట్రెండ్‌లో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరోగా కొత్త ప్రొమోషన్ స్ట్రాటజీస్‌ను ట్రై చేయడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటాడు. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేసే ఈ తరహా మ్యాజిక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈసారి కథను గెస్ చేసే ఛాలెంజ్ పెట్టడం, ఆపై నిజంగానే భారీ బహుమతి ఇవ్వడం అసలు కొత్త కోణం.

కిరణ్ అబ్బవరం సినిమా ఇండస్ట్రీలో రావడానికి చేసిన కష్టాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. సినీ రంగంలో రాణించాలంటే అవకాశాలతో పాటు ఆర్థికంగా కాస్త బ్యాకప్ అవసరమని, తాను కూడా ఫిల్మ్ నగర్, కృష్ణా నగర్ వీధుల్లో సినిమా కలలతో తిరిగిన రోజులున్నాయని గుర్తు చేసుకున్నాడు. అందుకే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక వ్యక్తికి కనీసం ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రయోగం చేశాడని తెలిపాడు. దీనికి ఇండస్ట్రీ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.

Tags:    

Similar News