పిక్‌టాక్‌ : పవన్ కళ్యాణ్‌ హీరోయిన్‌ స్టైలిష్ అవతార్‌

క్యూట్‌ లుక్‌తో స్కిన్‌ షో చేయకుండానే ప్రణిత చూపు తిప్పనివ్వడం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.;

Update: 2025-03-12 18:34 GMT

కన్నడ మూవీ 'పోర్కి' తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ప్రణిత సుభాష్‌. రెండో సినిమానే తెలుగులో చేసింది. 'ఎమ్ పిల్లో ఎమ్ పిల్లాడో' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నిరాశ పరిచిన అందంతో ఆకట్టుకుని గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ వెంటనే సిద్దార్థ్‌ హీరోగా నటించిన 'బావ' సినిమాలోనూ పల్లెటూరు అమ్మాయిగా నటించి పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు నటనతో అలరించడం వల్ల హీరోయిన్‌గా మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే లక్‌ కలిసి రాక పోవడంతో స్టార్‌ హీరోయిన్‌గా ఇమేజ్‌ను దక్కించుకోవడంలో విఫలం అయింది.

 

పవన్‌ కళ్యాణ్‌ అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రణిత ఆ వెంటనే ఎన్టీఆర్‌తో కలిసి ఒక సినిమాలో నటించింది. స్టార్‌ హీరోల సినిమాల్లోనూ నటించిన ప్రణితకి సరైన బ్రేక్ దక్కలేదు. దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ప్రణిత ఈమధ్య కాలంలో కాస్త స్లో అయింది. పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించేందుకు ఈమె రెడీగా ఉంది. గత సంవత్సరం ఈమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

 

ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్లు దాటినప్పటికీ అందం విషయంలో ఇంకా కొత్త హీరోయిన్స్‌కి పోటీ అన్నట్లుగా ఉంటుంది. మూడు పదుల వయసులో పడ్డా కూడా ప్రణిత ఆకట్టుకుంటుంది. 20 ఏళ్ల పడుచు అమ్మాయి మాదిరిగానే ఇప్పటికీ అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె స్టైలిష్‌ డ్రెస్‌లో ట్రెండీ డ్రెస్‌ల్లో ఎక్కువగా అలరిస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ప్రణీత సుభాష్ షేర్‌ చేసే ఫోటోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఈమె మరోసారి స్టైలిష్ అవతార్‌లో కనిపించింది. విభిన్నమైన ఔట్‌ ఫిట్‌లో డిఫరెంట్‌ లుక్‌, స్టైల్‌తో అలరించిన ఈ అమ్మడు మరోసారి అలరించింది.

క్యూట్‌ లుక్‌తో స్కిన్‌ షో చేయకుండానే ప్రణిత చూపు తిప్పనివ్వడం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రణిత అందంకు స్టార్‌ హీరోలకు జోడీగా ఇప్పటికి వరుసగా సినిమాలు చేయాల్సి ఉంది. సమంత స్థాయిలో స్టార్‌డంను సొంతం చేసుకోవాలి. కానీ ఆ స్థాయిలో ప్రణితకు ఆఫర్లు రాలేదు. లక్‌ కలిసి రాకపోవడంతో ఈమెకు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదు అనేది కొందరి అభిప్రాయం. ముందు ముందు అయినా ప్రణిత తన అందంతో అలరించి సీనియర్‌ స్టార్‌ హీరోలకు జోడీగా అయినా నటించే అవకాశాలు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News