వార్ 2 - కూలీ.. బిజినెస్ కోసం గొడవలు లేకుండా న్యూ ప్లాన్!
ఈ రెండు సినిమాల బడ్జెట్, మార్కెట్ స్కేల్ దృష్ట్యా, నిర్మాతలు భారీ వ్యూహాలను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బిజినెస్ పరంగా చూస్తే, ఈ రెండు సినిమాలూ ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్‌లో రిలీజ్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాయి.;
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు భారీ ప్రాజెక్టులు వార్ 2 - కూలీ. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్ 2, లోకేష్ కనగరాజ్ - రజినీకాంత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కూలీ రెండూ 2025లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలుగా హైలెట్ అవుతున్నాయి. స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న వార్ 2 ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్‌ను హీట్ పెంచగా, రజినీకాంత్ అభిమానులు మాత్రం కూలీ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠలో ఉన్నారు.
ఈ రెండు సినిమాల బడ్జెట్, మార్కెట్ స్కేల్ దృష్ట్యా, నిర్మాతలు భారీ వ్యూహాలను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బిజినెస్ పరంగా చూస్తే, ఈ రెండు సినిమాలూ ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్‌లో రిలీజ్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాయి. వార్ 2 బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్, అలాగే కూలీ రజినీకాంత్ కెరీర్‌లో మళ్లీ పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసే సినిమా. ఊహించని స్థాయిలో ప్రమోషన్లు, భారీ ప్రీ రిలీజ్ బిజినెస్, మెరుగైన థియేట్రికల్ కవర్ కోసం ఇప్పటికే ప్లానింగ్ మొదలైంది.
ప్రత్యేకంగా, ఈ రెండు చిత్రాలు ఒకే వీకెండ్‌లో వస్తే, అవి ఒకదానిపై మరొకటి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో నిర్మాతలు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు ఇబ్బంది ఏంటంటే, మొదట కూలీ ఆగస్టు 14వ తేదీన రావాలని అనుకున్న సినిమా. అదే సమయంలో వార్ 2 కూడా అదే తేదీకి లాక్ చేసినట్లు సమాచారం. ఈ క్లాష్ వల్ల థియేట్రికల్ షేర్ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో, చిత్ర వర్గాలు ముందుగానే చర్చలు ప్రారంభించాయి.
తాజా సమాచారం ప్రకారం, కూలీ టీమ్ తమ రిలీజ్ డేట్‌ను వెనక్కి జరిపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాలు ఒకే వారం విడుదలైతే, థియేటర్ల షేరింగ్ సమస్యలు తప్పవు. అలాగే ఓపెనింగ్స్ పై కూడా దెబ్బ పడే అవకాశం ఉంది. అందుకే, రెండు సినిమాలు భిన్నమైన వీకెండ్స్‌లో విడుదలయ్యేలా ప్లానింగ్ జరుగుతోంది. ఇప్పటికే, కూలీ హక్కుల కోసం భారీ డిమాండ్ ఉంది. అయితే, రీలీజ్ డేట్ క్లారిటీ రాకపోవడంతో బిజినెస్ ఇంకా పూర్తి స్థాయిలో ఫైనల్ కాలేదు.
ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలను ప్రాఫిటబుల్‌గా మార్చడానికి, స్ట్రాటజిక్‌గా విడుదల చేయడం తప్పనిసరి. ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం, కూలీ ఆగస్టు చివరి వారానికి లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాలకు ఎంతటి డిమాండ్ ఉందో ఈ రెండు సినిమాల బిజినెస్ చూస్తే అర్థమవుతోంది. రెండూ కూడా వెయ్యి కోట్ల రేంజ్ లో.కలెక్షన్స్ అందుకునేలా బజ్ క్రియేట్ చేయనున్నాయి.
ఈ రెండు సినిమాలూ డిఫరెంట్ మార్కెట్లో పెద్ద హిట్ అవుతాయనే నమ్మకంతో, నిర్మాతలు స్ట్రాటజిక్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, హై బజ్ కలిగిన ఈ రెండు సినిమాలు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపకుండా విడుదల అవ్వడం సినీ పరిశ్రమకు మంచిది. డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, ప్రమోషన్ దృష్ట్యా ఈ వ్యూహం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.