అలియా, దీపికా.. పోటీ పడుతున్నారా..?
బాలీవుడ్ భామలైన అలియా, దీపికా తెలుగు సినిమా ఆఫర్ల కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరు మంచి నటీమణులు ఎవరి టాలెంట్ వారిదే ఐతే అలియా తెలుగులో నటించడమే కాదు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది.;
పాన్ ఇండియా లెవెల్ లో సౌత్ సినిమాల హవా తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు నేషనల్ లెవెల్ లో అదరగొట్టేస్తున్నాడు. అందుకే బాలీవుడ్ భామలంతా కూడా తెలుగు సినిమాల్లో నటించాలని చూస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ తారలు టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్, చేయగా కల్కి లో దీపికా పదుకొనె నటించింది. గేమ్ ఛేంజర్ లో కియర అద్వాని కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఐతే RRR తర్వాత అలియా మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలనే ఆసక్తి చూపిస్తుంది.
లాస్ట్ ఇయర్ జిగ్రా సినిమా చేసిన అలియా ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో ఆల్ఫా తో పాటు లవ్ అండ్ వార్ సినిమాల్లో నటిస్తుంది. ఐతే తెలుగు సినిమాల్లో ఏమాత్రం ఛాన్స్ వచ్చినా కాదన కూడదని ఫిక్స్ అయ్యింది అలియా అందుకే క్రేజీ కాంబినేషన్స్ కోసం ఎదురుచూస్తుంది. అలియా నటిస్తానంటే చాలు కానీ మన మేకర్స్ ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.
కల్కి 2898 ADతో మెప్పించిన దీపిక పదుకొనె కూడా తెలుగు సినిమాల మీద ప్రేమను పెంచుకుంది. కల్కిలో సుమతి పాత్రను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐతే కల్కి 2 లో నటించే అవకాశం ఉండగా దానితో పాటు మరిన్ని ఛాన్స్ లు వచ్చినా చేయాలని చూస్తుంది దీపిక. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న సినిమాల్లో దీపిక ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చైనా సరే దీపికను తెలుగు సినిమాల్లో నటింపచేయాలని చూస్తున్నారు.
బాలీవుడ్ భామలైన అలియా, దీపికా తెలుగు సినిమా ఆఫర్ల కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరు మంచి నటీమణులు ఎవరి టాలెంట్ వారిదే ఐతే అలియా తెలుగులో నటించడమే కాదు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. దీపిక కూడా తెలుగులో నటించేందుకు ఆసక్తి కనబరుస్తుంది.
వీరితో పాటు జాన్వి కపూర్ ఆల్రెడీ దేవర తో ఎంట్రీ ఇవ్వగా దేవర 2 లో కూడా నటిస్తుంది. ఇదే కాకుండా రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా జాన్వి కపూర్ నటిస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ భామలు ప్రాంతీయ సినిమాల్లో నటించాలంటే ఆసక్తి చూపించే వారు కాదు కానీ టాలీవుడ్ సినిమా స్టామినా ఏంటన్నది నేషనల్ లెవెల్ బాక్సాఫీస్ లెక్కల రూపంలో తెలుస్తున్న కారణంగా ఇక్కడ ఎలాంటి ఛాన్స్ వచ్చినా వదలకూడదని ఫిక్స్ అవుతున్నారు.